
ఖిలాపై స్వచ్ఛతా హీ సేవా
భువనగిరి: భువనగిరి ఖిలాపై సేవా పర్వ్, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం భారత, రాష్ట్ర పర్యాటక శాఖ, భువనగిరి రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాల, మున్సిపాలిటీ భాగస్వామంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖిలా పై ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా భారత పర్యాటక శాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కృపాకర్ మాట్లాడుతూ.. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి ప్రవీణ్, రాక్ క్లైంబింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.