
ఇంత దారుణం ఎన్నడూ లేదు
సొంత భూమితో పాటు ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాను. ఇప్పటి వరకు రూ. 3 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఈ ఏడు వర్షాలు బాగా దెబ్బతీశాయి. 15 ఎళ్లలో ఇంత దారుణంగా పత్తి చేలు ఉండటం ఇప్పుడే చూస్తున్న. పత్తి రైతులకు ఈ ఏడాది కూడా నష్టాలు తప్పవు.
– రేగు యాదయ్య, రైతు, మోటకొండూరు
కొంతకాలంగా కురుస్తున్న వర్షాలతో పత్తి రైతులకు ఇబ్బంది కలుగుతుంది. అధిక వర్షాల వల్ల చేలు ఎర్రబారడం, కాయ రంగుమారి, కుళ్లిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. రైతులు తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల సూచన మేరకు నివారణ చర్యలు తీసుకోవాలి.
– వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి

ఇంత దారుణం ఎన్నడూ లేదు