
విశిష్ట వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలి
రామన్నపేట: సమాజంలోని విశిష్ట వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ చేపట్టిన సేవా పక్షోత్సవంలో భాగంగా ఆదివారం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను, రాజకీయ రంగంలో దివ్యాంగుల పాత్ర అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించిన డాక్టర్ ఎన్. అశోక్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం, బుద్ధ గ్రంథాలయంను కాసం వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని అనేక మంది విశిష్ట వ్యక్తులు, ప్రాంతాలు, ప్రత్యేకతలను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. ఆయన వెంట నాయకులు నకిరేకంటి మొగులయ్య, మడూరి ప్రభాకర్‌రావు, మైల నర్సింహ, శాగ చంద్రశేఖర్‌రెడ్డి, మండల వెంకన్న, తాటిపాముల శివకృష్ణ, వనం అంజయ్య, బండ మధుకర్‌రెడ్డి, నకిరేకంటి మహేష్, చెరుపల్లి శ్రవన్, మొగిలి రమేష్, గూడెల్లి దామోదర్, గంజి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు

విశిష్ట వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలి