
లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం
భువనగిరిటౌన్ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. శనివారం కలేక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్ బాపూజీ అలుపెరగని పోరాటం చేశారని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సైతం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. సమాజానికి ఆయన ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ అధికారి సాహితితో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కుల, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు