
సివిల్స్‌కు సన్నద్ధమవుతూ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపిక
నల్లగొండ: నల్లగొండకు చెందిన దాడి వెంకటరమణ గ్రూప్–1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. వెంకటరమణ తండ్రి దాడి శ్రీనివాసరావు ఈడబ్ల్యూఐడీసీలో ఏఈగా పనిచేస్తుండగా.. తల్లి రమాదేవి ఎస్‌జీటీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వెంకటరమణ వరంగల్‌లో ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్, ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తిచేశారు. ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఆరేళ్లుగా సివిల్స్‌కి ప్రిపేరవుతూ గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అంతకుముందు ఆయన సివిక్స్ జూనియర్ లెక్చరర్‌గా, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా ఎంపికయ్యారు. గ్రూప్–2లో 378 ర్యాంకు సాధించారు.
ఐఏఎస్ కోసం సన్నద్ధమయ్యా..
నేను యూపీఎస్సీ ద్వారా ఐఏఎస్‌కు ఎంపిక కావాలని ప్రిపేర్ అయ్యా. 6 సంవత్సరాలుగా 4 సార్లు పరీక్ష రాసినా ఎంపిక కాలేదు. గ్రూప్–1 పరీక్ష రాసి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై ఆ కోరికను తీర్చుకున్నా. చాలా సంతోషంగా ఉంది. మా అమ్మానాన్నలు ఎంతో ఆనందపడుతున్నారు.
– దాడి వెంకటరమణ