
పాడి రైతులకు బిల్లులు ఆపడం అన్యాయం
భువనగిరిటౌన్ : ఎనిమిది నెలలుగా పాల బిల్లులు ఇవ్వకపోవడంతో పాడి పశువుల పోషణ భారంగా మారుతుందని పాడి రైతులు, రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి, జిల్లా అధ్యక్షుడు కల్లెపు అడివయ్య, ప్రధాన కార్యదర్శి బేజాడికుమార్ మాట్లాడుతూ పాల బిల్లులు ఆపడం వల్ల పాడి రైతులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సంస్థ ఉన్నతాధికారులు, పాలకవర్గం అక్రమాలకు పాల్పడి లాభాల్లో నడిచిన డెయిరీని బిల్లులు చెల్లించలేని స్థితికి దిగజార్చారని ఆరోపించారు. పాడి రైతులకు బిల్లులు చెల్లించడంతో పాటు సంస్థ లాభాల బాట పట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జనార్దన్, కొలనుపాక పాల సొసైటీ చైర్మన్ మామిడాల సోమయ్య, ఇక్కుర్తి పాల సొసైటీ చైర్మన్ చిరబోయిన రాజయ్య, ఆయా గ్రామాల పాడి రైతులు అయినా యాకయ్య గడ్డం నాగరాజు పిన్నపురెడ్డి రాఘవరెడ్డి, బర్మ బాబు, రామచంద్రు ఓరుగంటి మైసయ్య, మామిడాల బాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో పాడి రైతుల ధర్నా