
కూటమి సర్కార్ తీరు అప్రజాస్వామికం
ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటి పత్రికలపై దాడి చేయడం, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అంతేకానీ అక్రమంగా కేసులను పెట్టడం, విచారణ పేరుతో విలేకరులను పిలువడం తగదు. ఆంధ్రప్రదేశలో సాక్షి జర్నలిస్టులపై జరుగుతున్న సంఘటనలు రాజ్యాంగం ప్రసాదించిన బావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయి. జర్నలిస్టుల విషయంలో అక్కడి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామిక చర్య.
–భగత్, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు