
పత్రికా స్వేచ్ఛను హరించడమే..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. మీడియా సంస్థలపై కేసులు పెట్టడం గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సాక్షిపై అక్కడి ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో వ్యవహరించడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. మీడియా పట్ల ప్రభుత్వాలకు గౌరవం ఉండాలి. మీడియాను, మీడియా ప్రతినిధులను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వాలు ఎక్కువ రోజులు మనుగడ సాగించలేవు. పోలీసులను అడ్డం పెట్టుకొని కూటమి సర్కార్ పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి.
–గొంగిడి మహేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్