
ఎన్‌సీసీ జాతీయ శిబిరంలో ఆలేరు క్యాడెట్ల ప్రతిభ
ఆలేరు: వరంగల్ జిల్లా మామునూర్‌లోని పోలీసు శిక్షణ కేంద్రంలో జరుగుతున్న ఎన్‌సీసీ జాతీయ శిబిరంలో ఆలేరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నుంచి పది మంది ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించేందుకు గాను వివిధ రాష్ట్రాలకు చెందిన క్యాడెట్లు తమ సంస్కృతి, ఆచారాలు, భాషలు, వంటలు, అలవాట్లు తదితర అంశాలను పరస్పరం పంచుకున్నారు. ఆయా అంశాల్లో ప్రతిభ కబరిచినందుకు గాను ఆలేరు ఎన్‌సీసీ క్యాడెట్లు శ్రేణిక, శ్రీజ, వెన్నెల, దేవిక, అర్చన, మణి తదితరులకు క్యాంపు డిప్యూటీ కమాండెంట్ కల్నల్ రామదురై, జాతీయ శిబిరం శిక్షణాధికారి లెఫ్టినెంట్ కల్నల్ రవి సునారే, క్యాంపు అడ్జెసెంట్ డాక్టర్ ఎం. సదానందం తదితరులు అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేసినట్లు ఎన్‌సీసీ అధికారి దూడల వెంకటేష్ శుక్రవారం తెలిపారు.