
పత్రికా స్వేచ్ఛపై ‘కూటమి’ కుట్ర
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ నిరంకుశంగా వ్యవహరించడమే కాకుండా మీడియా స్వేచ్ఛను హరించడాన్ని పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, జర్నలిస్టు సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. పోలీసులను అడ్డం పెట్టుకొని మీడియాను, మీడియా ప్రతినిధులను ఇబ్బందులకు గురి చేస్తుందని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని మండిపడ్డారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డితో పాటు విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
– భువనగిరి, భువనగిరి టౌన్, యాదగిరిగుట్ట
జర్నలిస్టులపై దాడి చేయడం, అక్రమంగా కేసులు నమోదు చేయడం ప్రశ్నంచే గొంతుకను అణిచివేయడమే. ఏపీలో సాక్షి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదు. జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. చట్టసభలు, బ్యూరోక్రాట్లు, పత్రికలు ప్రజాస్యామ్యానికి కీలకమైనవి. వీటిలో ఏ ఒక్కటి దెబ్బతిన్నా ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. పత్రికలు, పాత్రికేయులపై అక్రమంగా కేసులు పెట్టడం, దాడులు చేయడం మానుకోవాలి.
–ఎండీ ఖదీర్, టీఎన్‌జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి
మీడియాపై దాడులకు పాల్పడటం, అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పత్రికలు,జర్నలిస్టులపై రాజకీయ కక్ష సాధింపులు మంచి విధానం కాదు. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థలో మీడియాకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అలాంటిది ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరం. సాక్షి ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసుల పట్ల పార్టీలకు అతీతంగా ఖండించాలి.
–సురుపంగ శివలింగం,
రాష్ట్ర కన్వీనర్, పీపుల్స్ మానిటరింగ్ కమిటీ

పత్రికా స్వేచ్ఛపై ‘కూటమి’ కుట్ర

పత్రికా స్వేచ్ఛపై ‘కూటమి’ కుట్ర