మల్లాపురంలో హైడ్రామా | - | Sakshi
Sakshi News home page

మల్లాపురంలో హైడ్రామా

Jun 16 2025 5:04 AM | Updated on Jun 16 2025 5:04 AM

మల్లా

మల్లాపురంలో హైడ్రామా

వలిగొండలో గొంగిడి సునీత నిరసన

వలిగొండ : కర్రె వెంకటయ్యను వలిగొండ పోలీస్‌స్టేషన్‌ తరలించారన్న సమాచారంతో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అక్కడికి చేరుకున్నారు. పార్టీ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆమరణ దీక్ష చేస్తున్న వెంకటయ్యను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి రహస్యంగా వలిగొండ పోలీస్‌ స్టేషన్‌కు తరలించడాన్ని ఆమె ఖండించారు. మెడికల్‌ కాలేజీని కాపాడుకునేందుకు శాంతియుతంగా దీక్ష చేపట్టగా పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. మెడికల్‌ కళాశాలను దాతర్‌పల్లికి తరలించే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. మల్లాపురంలోనే వైద్యకాలేజీ ఏర్పాటు చేస్తామని, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్‌, డీఎంహెచ్‌ఓ ఎవరైనా హామీ ఇచ్చే వరకు వెంకటయ్య దీక్ష కొనసాగుతుందన్నారు.

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో హైడ్రామా చోటు చేసుకుంది. మెడికల్‌ కళాశాలను మల్లాపురంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ యాదగిరిగుట్ట మండల శాఖ అధ్యక్షుడు, మల్లాపురం మాజీ సర్పంచ్‌ కర్రె వెంకటయ్య ఆదివారం మల్లాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో మాజీ ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత కృషి వల్ల మెడికల్‌ కళాశాల మంజూరైందని, మల్లాపురంలోని సర్వే నంబర్‌ 64 భూముల్లో నిర్మాణం చేసేందుకు నాటి సీఎం కేసీఆర్‌ జీఓ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం కళాశాలను మల్లాపురంలో కాకుండా వేరే చోటకు తరలించాలని నిర్ణయించడం సమంజసం కాదన్నారు. మల్లాపురంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కళాశాల, గ్రామ ప్రజల బాగు కోసం తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమని, గత ప్రభుత్వం కేటాయించిన ప్రాంతంలోనే మెడికల్‌ కాలేజీ నిర్మాణం జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇమ్మడి రాంరెడ్డి, ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌ గౌడ్‌, మాజీ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, పల్లెపాటి మాధవులు, బరిగె నర్సింహులు, మెటె శేఖర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

దీక్షను భగ్నం చేసిన పోలీసులు

వెంకటయ్య ఆమరణ దీక్షకు దిగిన కొన్ని గంటల్లోనే యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు మల్లాపురం చేరుకున్నారు. వెంకట య్యను బలవంతంగా అదుపులోకి తీసుకుని వలి గొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు మరికొందరిని స్టేషన్‌కు తరలించారు. గ్రామస్తులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకోబోగా ఉద్రిక్తత నెలకొంది.

గుట్టలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల ధర్నా, అరెస్ట్‌

యాదగిరిగుట్ట: బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య అరెస్టును నిరసిస్తూ మల్లాపురం గ్రామస్తులు, మండలం, పట్టణ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు యాదగిరిగుట్టలోని ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. తమ నాయకుడిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని గడ్డమీది రవీందర్‌గౌడ్‌, పాపట్ల నరహరి, మాజీ జెడ్పీటీసీ కర్రె కమలమ్మ తదితర నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వెంకటయ్యకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, క్షేమంగా అప్పగిస్తామని సీఐ భాస్కర్‌ వారికి చెప్పినా వినిపించుకోలేదు. దీంతో పోలీసుల అదుపులో ఉన్న కర్రె వెంకటయ్యతో పాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో మాట్లాడించడంతో వారు ఆందోళన విరమించారు.

కేటీఆర్‌, హరీష్‌రావు ఆరా..

కర్రె వెంకటయ్య ఆమరణ దీక్ష సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు ఆరా తీశారు. గొంగిడి సునీతకు ఫోన్‌ చేసి తెలుసుకున్నారు.

మెడికల్‌ కళాశాల మల్లాపురంలోనే ఏర్పాటు చేయాలని యాదగిరిగుట్ట బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు

కర్రె వెంకటయ్య ఆమరణ దీక్ష

భగ్నం చేసి వలిగొండ స్టేషన్‌కు తరలింపు

పోలీసుల తీరును నిరసిస్తూ గుట్టలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆందోళన, ఉద్రిక్తత

మల్లాపురంలో హైడ్రామా1
1/2

మల్లాపురంలో హైడ్రామా

మల్లాపురంలో హైడ్రామా2
2/2

మల్లాపురంలో హైడ్రామా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement