గ్రామాల్లో గంజాయి ఘాటు
యాదగిరిగుట్ట రూరల్: పట్టణాలకే పరిమితమైన గంజాయి..పల్లెలకూ పాకింది. ఇంటర్, డిగ్రీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి మాఫియా వ్యాపారం చేస్తోంది. నాగపూర్, ఆంధ్రా, ఒడిశా, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తరలిస్తోంది. దీంతో గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. విద్యార్థులు, యువకులు నిర్మానుష్య ప్రాంతాలు, నిరుపయోగంగా భవనాలను అడ్డాగా చేసుకుని గంజాయి సేవిస్తున్నారు. ఇటీవల యాదగిరిగుట్ట మండలంలో చోటు చేసుకున్న ఘటనలు కలవర పరుస్తున్నాయి. ఎస్‌ఓటీ పోలీసులకు పట్టుబడిన వ్యక్తులంతా యువకులే కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు
● యాదగిరిగుట్ట మండలంలోని ఓ గ్రామంలో కొందరు యువకులు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి రహస్య ప్రాంతంలో సేవిస్తుండగా ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
● యాదగిరిగుట్ట పట్టణ పరిధిలో ఓ వ్యక్తి వద్ద పోలీసులకు గంజాయి లభించింది.
● భువనగిరి బస్టాండ్‌లో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతూ ఎకై ్సజ్ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి కిలోన్నర గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
● హైదరాబాద్ నుంచి ఆలేరుకు గంజాయి తరలిస్తున్న యువకుడిని ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద 160 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేశారు.
● భువనగిరిలో ఓ వ్యక్తి బైక్‌పై గంజాయి తీసుకెళ్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు.అతని వద్ద నుంచి 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇలా వెలుగులోకి రాని ఘటనలు మరెన్నో ఉన్నాయి.
గుట్టుగా విక్రయాలు
ఇంటర్, డిగ్రీ విద్యార్థులే టార్గెట్
రోడ్లు, రైలు మార్గాల ద్వారా జిల్లాకు
అక్కడి నుంచి ద్విచక్రవాహనాలపై
పల్లెలకు చేరవేస్తున్న అక్రమార్కులు
ఈ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా..
రాష్ట్రంలోని పలు పట్టణాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు గంజాయి రవాణా జరుగుతోంది. ప్రధానంగా నాగాపూర్, ఆంధ్రా ఒడిశా బార్డర్, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో గంజాయి తీసుకువచ్చి రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. వాటిని ప్యాకెట్ల చేసి యువతకు విక్రయిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ రూ.500 నుంచి రూ.1000, పావు కిలో రూ.3,500, అరకిలో రూ.6,500, కిలో రూ.1,3000 వరకు విక్రయిస్తున్నారు.
పల్లెల్లో నిఘా ఉంచాం
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలు విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా టోల్‌ప్లాజాలు, ప్రతి బస్టాండ్, రైల్వే స్టేషన్‌ల వద్ద నిఘా ఉంచాం. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా సదస్సులు ఏర్పాటు చేసి దుష్ప్రరిణామాలపై అవగాహన కల్పిస్తున్నాం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కదలికలపై కన్నేసి ఉంచాలి.
– కృష్ణమూర్తి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్
తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
యువత మత్తుపదార్థాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు. గంజాయి అమ్మినా, సేవించినా కఠిన చర్యలుంటాయి. పల్లెలపైనా నిఘా ఉంచాం. ఎవరైనా విద్యార్థులు, యువకులు మత్తుపదార్థాలకు బానిసలై ఉంటే మా దృష్టికి తీసుకవస్తే వారికి కౌన్సిలింగ్ ఇస్తాం. పిల్లలు ఎక్కడికెళ్తున్నారు, ఏం చేస్తున్నారో తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి.
– భాస్కర్, యాదగిరిగుట్ట ఎస్‌హెచ్‌ఓ
గ్రామాల్లో గంజాయి ఘాటు
గ్రామాల్లో గంజాయి ఘాటు


