నిరీక్షణ ఉండదు..
ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు
రైతులు సాగు చేసిన పంట ఆధారంగా యూరియా కేటాయిస్తారు. వరికి ఎకరానికి రెండున్నర బస్తాలు ఇస్తారు. చెరకు కు 5 బస్తాలు, మిర్చికి 5 బస్తాలు, మొక్కజొన్నకు 5 బస్తాలు, పత్తికి నాలుగు బస్తాల యూరియా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యాప్‌లో పొందుపరిచింది. యాసంగి సీజన్‌లో 4.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నాయని, అందులో అత్యధికంగా 3.20 లక్షల ఎకరాల్లో వరి వేయనున్నారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకు గాను 24 వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా.. ప్రస్తుతం 10 వేల టన్నుల యూరియా ఉంది. డిమాండ్‌కు అనుగుణంగా యూరియా సరఫరాకు వ్యవసాయశాఖ అంచనాలను సిద్ధం చేసింది.
సాక్షి, యాదాద్రి : రైతులకు ఇకనుంచి సులువుగా యూరియా దొరకనుంది. గంటల తరబడి లైన్లలో నిల్చోవాల్సిన బాధలు తప్పనున్నాయి. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఫెర్టిలైజర్ యాప్ రూపొందించింది. రైతులు ఎక్కడినుంచైనా ఆన్‌లైన్ ద్వారా యూరియా బుక్ చేసుకోవచ్చు. నూతన విధానం ఈనెల 22 నుంచి అమల్లోకి రానుంది. ఆన్‌లైన్ బుకింగ్‌పై రెండు రోజులుగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 6.18 లక్షల ఎకరాల సాగు భూమి, 2.25 లక్షల మంది రైతులు ఉన్నారు.
బుక్ చేసే విధానం ఇలా..
● రైతులు తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా సులువుగా యూరియా బుక్ చేసుకోవచ్చు. ఫెర్టిలైజర్ యాప్ ఓపెన్ చేసి పాస్ బుక్ నంబర్ నమోదు చేయాలి.
● సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగానే పాస్‌బుక్ ప్రకారం రైతుకు ఉన్న భూమి వివరాలు వస్తాయి.
● రైతు సాగు చేసిన పంట వివరాల ఆధారంగా ఎంత యూరియా అవసరం, యూరియా తీసుకునే డీలర్ సమాచారం ఎంట్రీ చేయాలి. వెంటనే సదరు బుక్ చేసుకున్న డీలర్, మనగ్రోమోర్, పీఏసీఎస్ వద్దకు వెళ్లి యూరియా తీసుకోవచ్చు.
● బుకింగ్ చేసుకున్న 24 గంటల్లోగా యూరియా తీసుకోవాలి. మరింత యూరియా కావాలంటే 15 రోజులు ఆగాలి.
అవగాహన కల్పించేందుకు వలంటీర్లు..
ఫర్టిలైజర్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా వలంటీర్లను నియమించారు. ఫోన్ ద్వారా యూరియా బుక్ చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.అంతేకాకుండా పీఏసీఎస్, ప్రైవేట్ డీలర్లు, మన గ్రోమోర్ సెంటర్ల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 250 చోట్ల యూరియా విక్రయ సెంటర్లు ఉన్నాయి. అన్ని చోట్ల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.
అక్రమాలకు అడ్డుకట్ట
యూరియా చీకటి బజారుకు తరలిపోకుండా అడ్డుకట్టవేసేలా ప్రభుత్వం ఆన్‌లైన్ బుకింగ్ విధానం తెచ్చింది. ప్రధానంగా ఎక్స్‌ప్లోజీవ్స్‌తో పాటు పలు పరిశ్రమల్లో యూరియా వాడుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. వానాకాలం సీజన్‌లో యూరియా కొరత సమయంలో టాస్క్‌ఫోర్స్ జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఆన్‌లైన్‌లో యూరియా బుకింగ్
ఫ ఫర్టిలైజర్ యాప్ రూపొందించిన వ్యవసాయ శాఖ
ఫ 22వ తేదీ నుంచి అమల్లోకి
ఫ నూతన విధానంపై రైతులకు అవగాహన
ఫ తప్పనున్న లైన్ల బాధలు
జిల్లాలో ఈనెల 22 నుంచి యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవచ్చు. నూతన విధానం ద్వారా యూరియా పంపిణీలో పారదర్శకత ఉంటుంది. యూరియా ఎంత స్టాక్ ఉంది, ఎంత అవసరమనేది ఎప్పటికప్పుడు తెలుస్తుంది. అంతేకాకుండా రైతులు గంటల తరబడి లైన్లలో నిలబడే పరిస్థితి లేకుండా ఇంటి నుంచే బెక్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా యూరియా బుకింగ్‌పై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
–వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
నిరీక్షణ ఉండదు..
నిరీక్షణ ఉండదు..


