పాఠశాలలకు స్మార్ట్ టీవీలు అందజేత
యాదగిరిగుట్ట: టీటీఏ (తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మండలంలోని 27 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు శుక్రవారం స్మార్ట్ టీవీలు అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీటీఏ చైర్మన్ మయూర్ బండారు మాట్లాడుతూ..గ్రామీణ పాఠశాలలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో సేవా డేస్‌లో భాగంగా తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. అంతకుముందు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీఏ సేవా డేస్ కమిటీ అధ్యక్షుడు మలిపెద్ది నవీన్‌రెడ్డి, కో ఆర్డినేటర్ కంది విశ్వ, బీరం మధుకర్‌రెడ్డి, అడ్వయిజర్లు ద్వారాకాంతరెడ్డి, వెంకన్న, సురేష్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గణేష్ మాధవ్ వీరమనేని, ఇంటర్నేషనల్ సర్వీస్ డైరెక్టర్ దూదిపాల జ్యోతిరెడ్డి, విజయపాల్‌రెడ్డి, మెహన్‌రెడ్డి పట్వాడా, భరత్‌రెడ్డి, డీఎల్‌ఎన్‌రెడ్డి, ఎంఈఓ శరత్‌యామిని, తహసీల్దార్ గణేష్, ఎంపీడీవో నవీన్‌కుమార్, నాయకులు బీర్ల శంకర్, చీర శ్రీశైలం, ఎరుకల హేమేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


