త్వరలో సహకార ఎన్నికలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీసీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాలకు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏడాదిన్నర కిందటే వాటి పాలకవర్గాల గడువు ముగిసిపోయింది. అయితే ప్రభుత్వం ఆరు నెలలకోసారి ఆయా పాలకవర్గాల గడువును పొడిగిస్తూ వస్తోంది. ప్రస్తుత పాలవర్గాల గడువును ఈసారి గడువును పొడగించకుండా ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ఆయా పాలకవర్గాలను రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీల పర్సన్ ఇన్‌చార్జిలుగా కలెక్టర్లు, సొసైటీలకు సహకార ఆఫీసర్లను నియమించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సొసైటీ ఎన్నికలు నిర్వహించేంత వరకు వీరి ఆధ్వర్యంలో డీసీసీబీ, సహకార సంఘాలు పని చేస్తాయి.
గతేడాది కాంగ్రెస్ చేతికి వచ్చిన డీసీసీబీ
జిల్లాలో 2020 ఫిబ్రవరిలో డీసీసీబీ, సొసైటీలకు ఎన్నికలు జరిగాయి. గతేడాది ఫిబ్రవరిలోనే పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. బీఆర్‌ఎస్ పాలనలో డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి వ్యవహరించారు. అయితే ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డీసీసీబీలోని కొందరు డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపారు. దీంతో చైర్మన్‌గా ఉన్న మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లతో పాటు బీఆర్‌ఎస్‌కు చెందిన డైరెక్టర్లు కూడా మద్దతు పలికారు. 20 మంది డైరెక్టర్ల సహకారంతో కుంభం శ్రీనివాస్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా గతేడాది జూలై 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏడాదిన్నర పాటు చైర్మన్‌గా వ్యవహరించారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత రెండోసారి ఆగస్టు 14వ తేదీన గడువు పొడిగించింది.
రాష్ట్రంలోనే రెండో స్థానంలో
మన డీసీసీబీ
నల్లగొండ డీసీసీబీ దాదాపు రూ.3 వేల కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. పంట రుణాలు, కొత్త బ్రాంచీలు ఏర్పాటు, బ్రాంచీల్లో అధునాతన సౌకర్యాలు, డీసీసీబీ ఆధునీకరణ, విదేశీ రుణాలు, గోల్డ్ లోన్స్ ఇవ్వడంలో అగ్రస్థానం సాధించింది. రుణాల రికవరీలోనూ ముందంజలో ఉంది.
ఫ డీసీసీబీ, పీఏసీఎస్ పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఫ పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జిలుగా
సంఘం సీఈఓలు
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠికి నల్లగొండ డీసీసీబీ బాధ్యతలు
జిల్లాల వారీగా
పీఏసీఎస్‌లు ఇలా..
సూర్యాపేట 47
నల్లగొండ 42
యాదాద్రి 21
మొత్తం 110


