లెక్కల సమర్పణ ఆన్‌లైన్‌లో..
బుక్‌లెట్‌లో రాసి అప్పగించాలి
భువనగిరిటౌన్ : పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఖర్చు వివరాలను సమర్పించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. కాగితం రూపంలో ఎంపీడీఓలకు సమర్పించిన వివరాలను, అధికారులు టీఈ–పోల్ వెబ్ పోర్టల్‌లో లెక్కలు అప్‌లోడ్ చేయనున్నారు. ఈ నివేదికలను 2026 ఫిబ్రవరి 15లోగా పంపాలని స్టేట్ ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల పారదర్శకత పెరుగుతుందని పేర్కొంది.
గడువులోపు సమర్పించకపోతే వేటే..
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేసిన లెక్కలను అప్పచెప్పకుంటే వారిపై అనర్హత వేటు తప్పదంటున్నారు అధికారులు. ఎన్నికల నిబంధన ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు.. వారికి గుర్తులు కేటాయించిన రోజునుంచి ఫలితాలు వెలువడే వరకు ఖర్చు చేసిన లెక్కలు ఎంపీడీఓలకు అప్పగించి రశీదు తీసుకోవాలి. 45 రోజుల్లోగా లెక్కల వివరాలు సమర్పించకపోతే పంచాయతీరాజ్ చట్టం –2018లోని సెక్షన్ 23 ప్రకారం వేటు పడుతుంది. గెలిచిన అభ్యర్థులు పదవి కోల్పోవడంతో పాటు మరో మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురవుతారు. ఓడిన అభ్యర్థులు సైతం మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. లెక్కలు నమోదు చేసేందుకు అభ్యర్థులకు ఇప్పటికే బుక్‌లెట్‌లను అందజేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నిల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికల సందర్భంగా ప్రచా ర సాధనాలు, భోజనాలు తదితర వాటికి ఖర్చుచేసిన లెక్కలను తప్పనిసరిగా సమర్పించారు. ఖర్చు వివరాలను బుక్‌లెట్‌లో రాసి అప్పగించాలి. లేనట్లయితే వారిపై పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అనర్హత వేటు పడుతుంది. ప్రతి అభ్యర్థి తమ లెక్కలను నిర్దిష్ట గడువులోపు మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులకు సమర్పించాలి.
–ఆవుల కిషన్, ఎంపీఓ, రాజాపేట
అభ్యర్థుల ఎన్నికల వ్యయం నమోదుకు ‘టీఈ–పోల్’
ఫ నూతన విధానం తీసుకువచ్చినరాష్ట్ర ఎన్నికల సంఘం
ఫ గడువులోపు పంపాలని
అభ్యర్థులకు ఆదేశాలు
ఫ లెక్క చెప్పకపోతే మూడేళ్లు అనర్హత వేటు


