మల్లవరంలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

మల్లవరంలో అగ్నిప్రమాదం

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

భీమడోలు: చెట్టున్నపాడు పంచాయతీ శివారు మల్లవరం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ రేకుల షెడ్డు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే.. మల్లవరం గ్రామానికి చెందిన గొట్టుముక్కల నరసింహారాజుకు చెందిన సిమెంట్‌ రేకుల ఇంటిలో మేడిశెట్టి లక్ష్మీనారాయణ కుటుంబం అద్దెకు నివాసముంటోంది. మంగళవారం రాత్రి ఇంట్లో ఒక్కసారిగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించడంతో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో కుటుంబ సభ్యులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఇంటిలోని విలువైన గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే పక్కనే ఉన్న రెండు ఎండుగడ్డి వాములు కూడా అంటుకుని కాలిపోయాయి. సమాచారం అందుకున్న భీమడోలు ఫైర్‌ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో బాధితుడు లక్ష్మీనారాయణ కుటుంబం సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. బుధవారం సమాచారం తెలుసుకున్న ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు బాధితులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement