పెనుగొండ: రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల విద్యార్థులు చినమల్లంలో రైతులకు సమగ్ర సస్యరక్షణపై బుధవారం శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా వివిధ పంటలను ఆశించే చీడపీడలు, వాటి లక్షణాలు, నివారణ పద్ధతులను చార్టుల ద్వారా రైతులకు వివరించారు. పురుగుల లక్షణాలు, వాటి వల్ల కలిగే నష్టాలపై ప్రత్యక్ష నమూనాలతో అవగాహన కల్పించారు. అలాగే ఫెరోమోన్ ట్రాప్ల (లింగ ఆకర్షక బుట్టలు) వినియోగంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు తమ పంటల్లోని సమస్యలను చర్చించి, నిపుణుల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకున్నారు. శిక్షణ అనంతరం శాస్త్రవేత్తలు రైతులకు శాసీ్త్రయ సస్యరక్షణ పద్ధతులపై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్టేరులోని ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ, భూసార శాస్త్ర విభాగ శాస్త్రవేత్త డాక్టర్ బాలాజీ నాయక్ పాల్గొన్నారు.


