భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీల పరిష్కారంలో అధికారులు చొరవ చూ పాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. సో మవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. క్యూఆర్ కోడ్ పీజీఆర్‌ఎస్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అక్షరాంధ్ర క్లాసులు నిర్వహణలో హాజరు శాతం పెంచాలని అధికారులను వర్చువల్‌గా ఆదేశించారు. వచ్చే మార్చిలో జరిగే టెన్త్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. జాయింట్ కలెక్టర్ కల్పనశ్రీ, డీఆర్వో పి.గ్లోరియా, పీజీఆర్‌ఎస్ నోడల్ ఆఫీసర్ వై.దోసిరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు..
ఆశావర్కర్లకు జీతాల్లేవ్
ఆశావర్కర్లకు ప్రతినెలా జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. గత నెల జీతాలు ఇప్పటికీ పడలేదని, జిల్లాలో 15 మందికి ఏప్రిల్, జూన్ జీతాలు ఇవ్వలేదని, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
నాయీబ్రాహ్మణుల ఉపాధికి గండి
భీమవరంలో కార్పొరేట్ స్థాయి మాదిరిగా సెలూన్ షాపులు రావడం, తక్కువ ధరలకే సేవలందించడంతో తమ ఉపాధి దెబ్బతింటోందని నాయీబ్రాహ్మణ సంఘ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం అధ్యక్షుడు వేపాడ పెద్దిరాజు, సెక్రటరీ కోడూరి రామకృష్ణ, సభ్యులు ఉన్నారు.
ధాన్యం తూకాల్లో మోసాలు అరికట్టాలి
భీమవరం: ధాన్యం తూకాల్లో చేసే మోసాలను అరికట్టాలని, కొత్త గోనె సంచులు ఇవ్వాలని, రైతు సేవా కేంద్రంలో వచ్చిన తేమ శాతమే ఫైనల్ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనే యులు మాట్లాడుతూ వరి పంట మాసూళ్ల సందర్భంలో ప్రతి పంటకూ ధాన్యం తూకాల్లో మోసాలు జరుగుతున్నాయన్నారు. నిబంధనలకు అదనంగా ప్రతి బస్తాకు 600 గ్రాములు తూస్తున్నారన్నారు. ర వాణా వాహనం, జట్టు కూలీలున్న మధ్యవర్తులకు నిబంధనలు ప్రకారం ధాన్యం పట్టాలని నోటీసులు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరగా చర్యలు తీసుకుంటామని ఆమె సమాధానమిచ్చారు.


