ఎన్నికల విధుల మినహాయింపునకు వినతి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల మినహాయింపునకు వినతి

Oct 13 2026 1:11 AM | Updated on Oct 13 2026 1:11 AM

ఎన్నికల విధుల మినహాయింపునకు వినతి స్పెషల్‌ టెట్‌కు ఇద్దరు గైర్హాజరు చట్టపరిధిలో పరిష్కారం చూపాలి చించినాడ బ్రిడ్జిపై రాకపోకల నిలిపివేత

భీమవరం : స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే కొన్ని వర్గాల ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా జిల్లా ఫ్యాఫ్టో చైర్మన్‌ విజయరామరాజు, సెక్రటరీ జనరల్‌ జి.ప్రకాశం సోమవారం డీఆర్వో పి.గ్లోరియాకు వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్న, గర్భిణులు, బాలింత తదితర ఇబ్బందు లతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఫ్యాఫ్టో సంఘ సభ్యులు రామచంద్రరావు, క్రాంతికుమార్‌, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ఏపీ స్పెషల్‌ టెట్‌–2026 పరీక్షలకు ఇద్దరు ఉ పాధ్యాయులు గైర్హాజరయ్యారని డీఈఓ ఓవీఎస్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. 187 మంది అభ్యర్థులకు 185 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.

భీమవరం : ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోపు చట్టపరిధిలో శా శ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ అ ద్నాన్‌ నయీం అస్మి ఆదేశించారు.జిల్లా పో లీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం పీ జీఆర్‌ఎస్‌లో భాగంగా ఫిర్యాదులు స్వీకరించా రు. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్‌ అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. విచారణలో జా ప్యం వహించకుండా, పారదర్శకమైన పద్ధతి లో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప నిచేయాలని సూచించారు. అదనపు ఎస్పీ (అ డ్మిన్‌) డి.విశ్వనాథ్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పె క్టర్‌ కేవీవీఎన్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

అమలాపురం రూరల్‌: కోనసీమ – పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతున్న చించినాడ వంతెనపై ఈ నెల 15న ఉదయం 6 నుంచి 16వ తేదీ ఉదయం 6 గంటల వరకూ రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపా రు. కాంక్రీట్‌, తుది తారు పొర ఏర్పాటు చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement