అవినీతి కేసులో ఏఈకి జైలు | - | Sakshi
Sakshi News home page

అవినీతి కేసులో ఏఈకి జైలు

Oct 13 2026 1:11 AM | Updated on Oct 13 2026 1:11 AM

అవినీతి కేసులో ఏఈకి జైలు

ఏలూరు టౌన్‌: అవినీతి నిరోధక శాఖ లంచాలు తీసుకునే వారిని పట్టుకోవడంతో పాటు, అవినీతి అధికారులకు శిక్షణ పడే లా చేస్తోందని ఏలూరు రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు తెలిపారు. లంచం కేసులో విద్యుత్‌ శాఖ ఏఈ భూక్యా బాలకృష్ణకు రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టు శిక్ష విధించిందన్నారు. రెండు సెక్షన్లలో రెండేళ్ల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిందన్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపూడి మండలం రాఘవాపురానికి చెందిన భూక్యా బాలకృష్ణ ఏపీఈపీడీసీఎల్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆ సమయంలో చింతలపూడి మండలం కమలాపురానికి చెందిన ఓ రైతు పొలానికి త్రీఫేజ్‌ విద్యుత్‌ సర్వీస్‌ పునరుద్ధరణ నిమిత్తం డబ్బులు డిమాండ్‌ చేశారు. 2008 మే 3న ఏఈ బాలకృష్ణ రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు కుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో తుదితీ ర్పున ఏసీబీ కోర్టు వెలువరించింది. ఓ సెక్షన్‌లో ఏడాది జైలు, రూ.1,000 జరిమానా, మరో సెక్షన్‌లో మరో ఏడాది జైలు, రూ.1,000 జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున స్పెషల్‌ పీపీ జి.వెంకటరత్నం బాబు వాదనలు వినిపించగా, ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు, ఏసీబీ సీఐ ఎం.బాలకృష్ణ సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement