స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుదాం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుదాం

Oct 10 2026 1:22 AM | Updated on Oct 10 2026 1:22 AM

రఘురామరాజుపై సైటెర్లు

వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ అమర్నాఽథ్‌

సాక్షి, భీమవరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సిద్ధం కా వాలని రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ గుడివాడ అమర్నాథ్‌ పిలుపునిచ్చారు. ప్రతి స్థానంలో అభ్యర్థులు పోటీ లో ఉండాలని సూచించారు. ఉండి నియోజకవర్గ సమన్వయకర్త మంతెన యోగీంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం స్థానిక కోట్ల ఫంక్షన్‌ హాలులో జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యా ణి, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్‌, వంక రవీంద్రనాథ్‌, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, ఏలూరు, చింతలపూడి కోఆర్డినేటర్లు వడ్డి రఘురాంనాయుడు, చినమిల్లి వెంకటరాయుడు, గుడాల శ్రీహరిగోపాలరావు, మామిళ్లపల్లి జయప్రకాష్‌, కంభం విజయరాజు తదితరులు హాజరయ్యారు.

కుట్రలను తిప్పికొడదాం

ఈ సందర్భంగా అమర్నాథ్‌ మాట్లాడుతూ కూటమి నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతారని వాటన్నింటిని సమర్థవంతంగా అడ్డుకోవాలన్నారు. ఎవరికి భయపడాల్సిన పనిలేదని శ్రేణులకు జగన్‌, పార్టీ అండగా ఉంటుందన్నారు. వచ్చే ఏడాది జగన్‌ చేపట్టనున్న పాదయాత్ర కూటమికి అంతిమయాత్ర అవుతుందన్నారు. ఎమ్మెల్సీ కళ్యాణి మాట్లాడుతూ జగన్‌ రాష్ట్రాన్ని స్కీమ్‌ ఆంధ్రప్రదేశ్‌గా చేస్తే చంద్రబాబు స్కామ్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. కూటమిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం ఖాయమన్నారు.

కూటమిది దుర్మార్గపు పాలన

జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని, అధికార కూ టమికి ధనబలం, పోలీస్‌బలం, మద్యం బలం అ న్నీ ఉన్నాయన్నారు. వైఎస్సార్‌సీపీకి ప్రజాబలం ఉందని, జగన్‌ పథకాలతో లబ్ధి పొందిన వారంతా వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారన్నారు.

కార్యకర్తలే బలం : మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలమని భారీ సంఖ్యలో తరలివచ్చిన క్యాడర్‌ నిదర్శనమన్నారు. గతంలో ఇన్‌చార్జిగా పనిచేసిన నేత ఇటీవల పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఒక్క కార్యకర్త కూడా ఆయన వెంట వెళ్లలేదన్నారు.

గుణపాఠం తప్పదు

ఎమ్మెల్సీ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ కూటమి నిర్లక్ష్యంతో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చి సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఎమ్మెల్సీ కవురు మాట్లాడుతూ సూపర్‌సిక్స్‌ అని చెప్పి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. తాడేపల్లిగూడెం కో–ఆర్డినేటర్‌ రఘురాంనాయుడు మా ట్లాడుతూ ఉండిలో క్యాడర్‌ చాలా ఉత్సాహంగా ఉన్నారని, యోగీంద్రబాబు సారథ్యంలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం ఖాయమన్నారు.

క్యాడర్‌కు గుర్తింపు : వైఎస్సార్‌సీపీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, అందుకు తానే నిదర్శనమని నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ యోగీంద్రబాబు అన్నారు. తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం పట్ల జగన్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. క్యాడర్‌ సహకారంతో టీడీపీ కంచుకోటను కూలుస్తామన్నారు.

పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం

యోగీంద్రబాబు నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా ని యమితులయ్యాక మొదటిసారిగా ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి సమావేశం సూపర్‌ సక్సెస్‌ కావడం కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు సమావేశానికి తరలివచ్చారు. పార్టీ అ నుబంధ విభాగాల రాష్ట్ర నేతలు పాతపాటి శ్రీనివాస రాజు, పెండ్ర వీరన్న, యాండ్ర వీరాాస్వామి, కోడే యుగంధర్‌, పేరిచర్ల విజయనరసింహరాజు, మేడిద జాన్సన్‌, జిల్లా మహిళ అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, సోషల్‌ మీడియా జిల్లా కన్వీనర్‌ బంధన పూర్ణచంద్రరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ జామి హైమావతి, అంబటి సురేష్‌, గొర్రుముచ్చు సుందర్‌కుమార్‌, ఎస్సీ సెల్‌ కమిషన్‌ మాజీ సభ్యుడు చెల్లెం ఆనంద్‌ ప్రకాష్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కొండేటి శివకుమార్‌ పాల్గొన్నారు.

ఉండిలో సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులు, మాట్లాడుతున్న రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ అమర్నాథ్‌. చిత్రంలో ఎమ్మెల్సీలు కళ్యాణి, శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు, సమన్వయకర్తలు రఘురాం, వెంకటరాయుడు, యోగీంద్రబాబు

విస్తృతస్థాయి సమావేశం వేదికగా ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజుపై వైఎస్సార్‌సీపీ నేతలు తమదైన శైలిలో విమర్శలు సంధించారు. ఎమ్మెల్సీ కళ్యాణి మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు తన సొంత కానిస్టేన్సీలో ఉండరు కాని ఎప్పుడు కాంట్రవర్సీల్లో ఉంటారన్నారు. రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తుంటారని, ఎమ్మెల్యేలు ఎవరైనా పేదలకు ఇళ్లు కట్టిస్తే ఈయన మాత్రం పేదల ఇళ్లు కూలగొడుతుంటారన్నారు. అమర్నాథ్‌ మా ట్లాడుతూ రఘురామకృష్ణంరాజు ఎంపీ సీటు రా కపోవడంతో టీడీపీ నుంచి ఎమ్మెల్యే సీటు తె చ్చుకుని ఆ పార్టీని బ్లాక్‌మెయిల్‌ చేసి డిప్యూటీ స్పీ కర్‌ అయ్యారన్నారు. ఎక్కడో ఉంటూ రాజకీ యాలు చేసే నాయకుల్ని తరమికొట్టాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement