భీమవరం: సేవా సంకల్ప్ అభియాన్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న జిల్లా విద్యార్థులను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తమీమ్ అన్సారియా అభినందించారు. చినకాకానిలో రెండు రోజులపాటు జరిగిన సేవా సంకల్ప అభియాన్–డ్రాయింగ్, వక్తృత్వ పోటీలకు జిల్లాస్థాయిలో విజేతలైన 13 మంది పాల్గొన్నారు. విద్యార్థులు టి.సాయిప్రియ, ఎ.సలో మి, ఎ.మంగశ్రీ దుర్గ, ఎ.పూర్ణ శ్రీమంగ, వి.సుస్మిత, ఎ.ఉమామహేశ్వరి, వి.గీతిక, ఎం. జ శ్వంత్ సత్య, ఎన్.షర్మిల, పి.రమాదేవి, వి.దశ పూర్ణిమ, జి.మమత, ఎన్.మహిమరాజు పాల్గొనగా ఎస్కార్ట్ టీచరుగా రేపాక వెంకన్న బాబు వ్యవహరించారు. వీరికి శుక్రవారం తమీమ్ అన్సారియా సర్టిఫికెట్లు అందించారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులను తనిఖీ చేసేందుకు సౌత్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ శుక్రవారం తాడేపల్లిగూడెం విచ్చేశారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆయ న్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. తాడేపల్లిగూడెంలో వందే భారత్, పలు సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఆపకపోవడంతో ప్రయాణికులు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఈ స్టేషన్‌కు మొ దటి ప్రాధాన్యమివ్వాలని, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సందీప్ మాథుర్ మా ట్లాడుతూ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపి చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ డివిజన్ డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి.ప్రశాంతకుమార్, రైల్వే మాస్టార్ ఎస్.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): అమరావతి ఆర్థిక ప్రాంత అభివృద్ధి ప్రణాళికలో భాగంగా జిల్లాలో ఆర్థిక వృద్ధి అవకాశాలను గుర్తించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జేసీ కేఆర్ కల్పశ్రీ సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వివిధ రంగాల అభివృద్ధిపై చర్చించారు. ప్రైస్ వాటర్ హౌస్ సంస్థ ప్రతినిధులు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి, స్థానికంగా ఉన్న వనరులు, సంప్రదాయ రంగాలు, పారిశ్రామిక అవకాశాలు, వ్యవసాయం, ఆక్వా రంగం, పర్యాటక ప్రాంతాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాల ఆధారంగా జిల్లాలో ఆర్థికవృద్ధిని పెంపొందించే ప్రణాళిక, కీలక అభివృద్ధి కేంద్రాలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన అవకాశాలపై కార్యశాలలో వివరించారు. జిల్లాలో వరి సాగు, బియ్యం మిల్లింగ్, నిల్వ సదుపాయాలు, ఆక్వా సాగు, రొయ్యల ప్రాసెసింగ్, చేనేత, ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని కార్యశాలలో వివరించారు. భీమవరం–ఆకివీడు ఆక్వా, వరి ప్రాంతం, తణుకు పారిశ్రామిక ప్రాంతం తదితరాల అభివృద్ధికి అవసరమైన అవకాశాలను పరిశీలించాలని సూచించారు.


