మహిళలకు రక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

మహిళలకు రక్షణ కరువు

Oct 10 2026 1:22 AM | Updated on Oct 10 2026 1:22 AM

మహిళలకు రక్షణ కరువు

ఉండి: కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మరోసారి రుజువైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విరుచుకుపడ్డారు. శుక్రవారం ఉండిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ వేధింపులపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. టీడీపీ మంత్రి టీజీ భరత్‌ భూవివాదానికి సంబంధించి ఆమెను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ వద్దకు పంపించారన్నారు. సమస్య పరిష్కరించకపోగా తీవ్ర వేధింపులకు గురిచేయడంతో ఆమె డీఐజీ, ఎస్పీలకు ఫిర్యాదు చేసిందన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతుండటం సిగ్గుచే టని ముఖ్యమంత్రి, హోంమంత్రి తలదించుకోవాల్సిన ఘటన ఇది అన్నారు. మంత్రి సిఫార్సుతో వెళ్లిన మహిళకే రక్షణ లేకుంటే సామన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. హోంమంత్రి మహిళల రక్షణ కోసం చాలా కబుర్లు చెబుతున్నారని.. ఇప్పుడు ఎమ్మెల్యేపై ఎ లాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఎవరైనా మహిళను వేధిస్తే వారికదే చివరిరోజు అని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చెబుతున్నారు కదా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేకి చివరి రోజు చేయగలరా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్‌ ఏమైందని ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సుమోటోగా కేసు తీసుకుని ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు కళ్యాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement