మధ్యవర్తిత్వంలో మెలకువలు తెలుసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మధ్యవర్తిత్వంలో మెలకువలు తెలుసుకోవాలి

Oct 10 2026 1:22 AM | Updated on Oct 10 2026 1:22 AM

మధ్యవర్తిత్వంలో మెలకువలు తెలుసుకోవాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ట్రైనీ మీడియేటర్లు మధ్యవర్తిత్వంలో మరిన్ని మెలకువలు తెలుసుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి సూచించారు. శుక్రవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ట్రైనీ మీడియేటర్లకు ఒక రోజు ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని రిఫరల్‌ న్యాయమూర్తులకు, అనంతరం 102 ట్రైనీ మీడియేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం 3.0 మధ్యవర్తిత్వ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో మీడియేటర్లకు మరింత నైపుణ్యం పెంపొందించడం ద్వారా కేసుల పరిష్కారం మరింత సులభతరం అవుతుందన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదనపు జిల్లా న్యాయమూర్తులు, సీనియర్స్‌ సివిల్‌ జడ్జిలు, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి, ఎంసీపీసీ, చైన్నెకు చెందిన మాస్టర్‌ ట్రైనర్‌ సుదర్శన్‌ సుందర్‌, ఏలూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొనే సీతారాం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement