యజమాని ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

యజమాని ఇంట్లో చోరీ

Oct 10 2026 1:22 AM | Updated on Oct 10 2026 1:22 AM

యజమాని ఇంట్లో చోరీ చిట్టీల వ్యాపారి శ్రీనివాసరావు అరెస్టు

డ్రైవర్‌ అరెస్ట్‌

ఫిలింనగర్‌ : పనిచేస్తున్న ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన డ్రైవర్‌ను ఫిలింనగర్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లుకు చెందిన గామిడి శ్రీనివాసరావు (55) ఫిలింనగర్‌ రోడ్‌ నం. 7లో నివసించే రామచంద్ర వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన శ్రీనివాసరావు, యజమాని ఇంట్లోని ఖరీదైన, పురాతన ఇత్తడి పాత్రలను క్రమంగా దొంగిలించడం మొదలుపెట్టాడు. అనుమానం వచ్చిన యజమాని ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.

తణుకు అర్బన్‌/తాడికొండ: చిట్టీల పేరుతో ఖాతాదారులను మోసం చేసి పరారైన తణుకుకు చెందిన చిట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ వ్యాపారి గోలి శ్రీనివాసరావును విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 63 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు గతేడాది ఆగస్టులో తణుకు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్‌ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. నాటి నుంచి శ్రీనివాసరావు కుటుంబంతో సహా పరారయ్యాడు. బాధితులకు డబ్బులు తిరిగి చెల్లిస్తానని సంకేతాలు పంపుతూనే ముందస్తు బెయిల్‌ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించాడు.

బాధితుల ఆందోళన

బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తణుకు ప్రాంతానికి చెందిన బాధితులు హైకోర్టు వద్దకు చేరుకుని నిరసన తెలపగా, కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో శ్రీనివాసరావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో విజయవాడలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు తణుకుకు తరలించారు. నిందితుడిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు తణుకు పట్టణ సీఐ జేవీ రమణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement