భీమవరం: జిల్లాలో కొత్తగా టెండర్లు పిలిచిన 8 మద్యం షాపులను లాటరీ పద్ధతిలో కలెక్టర్ సీహెచ్ నాగరాణి కేటాయించారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ పరిధిలోని 25 మద్యం షాపులకు టెండర్లు పిలవగా 8 షాపులకు మాత్రమే దరఖాస్తులు వచ్చి న సంగతి తెలసిందే. వీటికి 64 దరఖాస్తులు రాగా లాటరీ నిర్వహించారు. షాపులు వారీగా భీమవరం మున్సిపాలిటీలో కొరాడ శ్రీనివాస్, భీమవరం రూరల్ మండలంలో మేడిది గీత, కాళ్ల మండలంలో తొంట నాగ వెంకట రవికుమార్, నరసాపురం రూరల్ మండలంలోని మూడు షాపులను పైడికొండల వెంకట గోపాలకృష్ణ, రావి మాణిక్యాలరావు, చల్లా భాస్కర వీరేంద్రరావు, పెనుగొండ మండలంలో నెక్కంటి సాగర్ కృష్ణ, పెనుమంట్ర మండలంలో కుక్కల లక్ష్మీనారాయణ దక్కించుకున్నారు. జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ బి.సుబ్బారావు పాల్గొన్నారు.
పాలకొల్లు సెంట్రల్: జాతీయ పురుషుల పారా త్రోబాల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా మండలంలోని దగ్గులూరుకు చెందిన కలిదిండి శివరామకృష్ణరాజు ఎంపకయ్యారు. వచ్చేనెల 19 నుంచి శ్రీలంకలో జరిగే 2వ సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఆయన పురుషుల జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత తాను అనుకున్న రంగాల్లో విజయం సాధించాలంటే శ్రమించాలని అన్నా రు. క్రీడారంగంలో విజయాలు సాధించిన వారికి ప్రభుత్వ, ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వం తనపై పెట్టిన బాధ్య తను పూర్తిస్థాయిలో నెరవేర్చి దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేస్తానన్నారు.
పెదవేగి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఆదేశాల మేరకు గురువారం భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ కుటుంబ వివాదాల వల్ల కుటుంబ వ్యవస్థ, పిల్లలు భవిష్యత్తు దెబ్బతింటుందని, వివాదాలకు పోకుండా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. కేసులను మధ్య వర్తిత్వం కార్యాలయానికి రిఫర్ చేయించుకుని పరిష్కారానికి సహకరించాలని సూచించారు, అవసరమైన న్యాయ సలహాల కోసం 15100 సంప్రదించాలన్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సీహెచ్ సూర్యచక్రవేణి, వన్‌స్టాప్ సెంటర్ లీగల్ అడ్వయిజర్ తేజస్వి, గ్రామ కార్యదర్శి భూపతిరాజు కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉద్యోగుల క్లెయిమ్‌లను వైద్యపరంగా పరిశీలించి, ధ్రువీకరించేందుకు జిల్లా వైద్య మండలిని ఏర్పాటు చేసినట్టు డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఏలూరు, పశ్చిమగోదావరి, పోలవరం జిల్లాలకు చెందిన పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులకు ఏలూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కేటాయించామన్నారు. ఈనెల 16 వరకు ఏలూరు జీజీహెచ్‌లో వైద్య మండలి అందుబాటులో ఉంటుందన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేజీబీవీ నియామకాలకు సంబంధించి మెరిట్ లిస్టులను జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష ఎక్స్–అఫీషియో ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ జిల్లా కార్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. జాబితాలపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 12న సాయంత్రం 5 గంటలలోపు సమగ్ర శిక్ష, ఏలూరు కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. గడువు దాటితే పరిశీంచబోమన్నారు.


