బియ్యం.. భయ్యం | - | Sakshi
Sakshi News home page

బియ్యం.. భయ్యం

Oct 9 2026 1:26 AM | Updated on Oct 9 2026 1:26 AM

బియ్యం.. భయ్యం

బియ్యం ధరలు (రూ.లలో)

భీమవరం(ప్రకాశం చౌక్‌): బియ్యం ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో కొన్నిరకాలు దాదాపు 40 శాతానికి పైగా పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. క్వింటాకు రూ.1,400 నుంచి రూ.2 వేల వరకు ధర పెరిగాయి. ఈ లెక్కన కిలోకు రూ.14 నుంచి రూ.20 వరకు పెరుగుదల కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలో ధాన్యం సమృద్ధిగా పండుతున్నా.. అత్యధిక మంది తినే సన్న రకాలు కాకపోవడంతో ఇక్కడి పండించిన ధాన్యం ఉత్పత్తి ధరలను ప్రభావం చేయలేకపోతోంది.

‘పప్పు’లు ఉడకడం లేదు!

బియ్యం బాటలోనే పప్పులు ధరలు పెరుగుతున్నాయి. ఇవి కూడా కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయి. కిలో కందిపప్పు రూ.120 నుంచి రూ.130కు, మినపప్పు రూ.105 నుంచి రూ.120, పెసరపప్పు రూ.100 నుంచి రూ.120, శనగపప్పు రూ.75 నుంచి రూ.100కు పెరిగింది.

కుటుంబ ఖర్చు తడిసిమోపెడు

బియ్యం, పప్పులు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుడికి కుటుంబ ఖర్చు నెలకు రూ.2 వేల వరకు పెరిగింది. అలాగే ఫంక్షన్లు, శుభ కార్యక్రమాలు, అన్నసమారాధనల నిర్వహణకు ధరల పెరుగుదల భారంగా మారింది. కూటమి ప్రభు త్వం ధరల ని యంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు, రేషన్‌ షాపులు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా త క్కువ ధరలకు బియ్యం, పప్పులు వంటి నిత్యావస ర సరుకులు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

రకం కిలోలు నెల క్రితం ప్రస్తుతం

స్వర్ణ 100 3,800 5,100

స్వర్ణ 26 1,000 1,400

సోనామసూరి 26 1,450 2,100

ఇతర రకాలు 26 1,100 1,400

బెధరగొడుతోంది

ధరలకు రెక్కలు

రోజురోజుకూ పెరుగుతున్న వైనం

నెల రోజుల్లో 40 శాతానికి పైగా పెరుగుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement