చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో జగనన్న కాలనీల్లో కనీస వసతులు కరువయ్యాయి. రెండేళ్లుగా అభివృద్ధికి నోచుకోక రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. పల్లె పండుగ 3.0 అంటూ హడావుడి చేస్తున్న పాలకులు ఈ కాలనీల వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కాలనీల్లోని దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.
సాక్షి, భీమవరం: పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. 626 లేఅవుట్లలో 47,362 మందికి ఇళ్ల స్థలాలు అందజేశారు. 1,152 ఎకరాలు సేకరణ, మెరక పనుల కోసం దాదాపు రూ.630 కోట్లు వెచ్చించారు. ఇళ్ల నిర్మా ణానికి అనువుగా అప్పట్లో కాలనీల్లో గ్రావెల్ రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయం కల్పించారు. భవిష్యత్తులో కాలనీల్లో జనాభాను బట్టి గేటెడ్ తరహాలో పార్కులు, లైబ్రరీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, క మ్యూనిటీ హాళ్లు తదితర వాటి నిర్మాణంతో పాటు భూగర్భ విద్యుదీకరణ పనులకు అప్పట్లో ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వం మారడటంతో అన్నీ మరుగునపడిపోయాయి. చంద్రబాబు సర్కారులో కనీస వసతులు కరువై పేదల జీవనం దుర్భరంగా మారింది. గత ప్రభుత్వంలో కాలనీల్లో ఏర్పాటుచేసిన ట్రాన్స్‌ఫార్మర్లను పలుచోట్ల తొలగించి వేరే ప్రాంతాలకు తరలించడం గమనార్హం.
ఈ చిత్రంలో పశువులు మేస్తూ కనిపిస్తోంది పొలం అనుకుంటే పొరబాటే. జిల్లాలో పెద్ద కాలనీగా పేరొందిన ఆకివీడు మండలం తాళ్లకోడు జగనన్న కాలనీలోని రోడ్డు ఇది. గత ప్రభుత్వంలో 73.50 ఎకరాల్లో 3,273 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 50 శాతం మేర ఇళ్లు నిర్మాణం జరగ్గా మూడు వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. కాలనీలో రెండు ప్రధాన, 40 వరకు అంతర్గత రోడ్లు ఉండగా సర్కారు నిర్లక్ష్యంతో సగానికి పైగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కొద్దిపాటి చినుకులకే చిత్తడిగా మారి అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి. కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డ్రెయిన్లు లేక ఇళ్లలోని వాడకం నీరు రోడ్లపైకి చేరుతోంది.
ఆ కాలనీలు.. సమస్యల లోగిళ్లు
జగనన్న కాలనీలపై కూటమి చిన్నచూపు
రెండేళ్లుగా నిలిచిన అభివృద్ధి పనులు
కనీస వసతుల కరువు
జిల్లాలో 1,157 ఎకరాల్లో 630 జగనన్న లేఅవుట్లు
ట్రాన్స్‌ఫార్మర్లను తరలించుకుపోయిన వైనం
47,362 పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ


