ఆర్చరీలో మెరిసిన ‘పశ్చిమ’ | - | Sakshi
Sakshi News home page

ఆర్చరీలో మెరిసిన ‘పశ్చిమ’

Oct 8 2026 3:54 AM | Updated on Oct 8 2026 3:54 AM

భీమవరం: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పశ్చిమగోదావరి క్రీడాకారులు సత్తాచాటారు. సీనియర్‌ కాంపౌండ్‌ మెన్‌, సీనియర్‌ కాంపౌండ్‌ ఉమెన్‌ విభాగాల్లో పతకాలు సాధించారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో మూడు రోజులుపాటు జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతులు అందించారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్చరీ అసోసియేషన్‌, వెస్ట్‌ గోదావరి ఆర్చరీ అసోసియేషన్‌, భీమవరం ఆర్చరీ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా యువశక్తి ఎదగాలని ఆకాంక్షించారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ సాగి రామకృష్ణ నిషాంత్‌వర్మ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడల్లో రాణించాలన్నారు. ఆర్చరీ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణ, జిల్లా అధ్యక్షుడు జయరాజు, వెస్ట్‌బెర్రీ స్కూల్‌ చైర్మన్‌ మహేష్‌వర్మ, ఎస్‌ఆర్‌కేఆర్‌ ప్రిన్సిపాల్‌ కేవీ మురళీకృష్ణంరాజు, డైరెక్టర్‌ ఎం.జగపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

● సీనియర్‌ రికర్వ్‌ మెన్‌: ఆర్‌.సాయి మౌర్య (నెల్లూరు), పి.రాజేష్‌ (నెల్లూరు), డి.ధనుష్‌ (విజయనగరం)

● సీనియర్‌ కాంపౌండ్‌ ఉమెన్‌: కామినేని రిషికీర్తన (కృష్ణా), వేగేశ్న స్ఫూర్తి (పశ్చిమగోదావరి), అల్లూరి కనిష్క (పశ్చిమగోదావరి)

● సీనియర్‌ కాంపౌండ్‌ మెన్‌: కర్రా బుద్దేశ్వరరావు (తూర్పుగోదావరి), పి.చరణ్‌ (కృష్ణా), మాగాపు సుహాస్‌ (పశ్చిమగోదావరి) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.

సీనియర్‌ కాంపౌండ్‌ ఉమెన్‌ విభాగంలో , సీనియర్‌ కాంపౌండ్‌ మెన్‌ విభాగంలో విజేతలు

రెండు విభాగాల్లో పతకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement