వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

వసతులు కల్పించాలి

Oct 8 2026 3:54 AM | Updated on Oct 8 2026 3:54 AM

వసతులు కల్పించాలి బురదలోంచే రాకపోకలు నరకయాతన ట్రాన్స్‌ఫార్మర్లు పట్టుకెళ్లిపోయారు

మా కాలనీలో రోడ్లు, డ్రెయిన్లు లేవు. వర్షం వస్తే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మా గోడు పట్టించుకున్న వారే లేరు. కాలనీల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– బొడ్డు ప్రేమ, జగనన్న కాలనీ, అత్తిలి

మా కాలనీలో రోడ్లు లేక బురదలోంచి రాకపోకలు సాగిస్తున్నాం. మురుగునీరు వెళ్లే దారిలేక దోమలు బెడద ఎక్కువైంది. పాములు, విషకీటకాల సంచారంతో భయపడుతున్నాం.

– కందుకూరి కృప, జగనన్న కాలనీ, ఉండి

వర్షాకాలం వస్తే నానాయాతన పడుతున్నాం. ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదు. గత్యంతరం లేక ఇక్కడే ఉంటున్నాం. కొత్త లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు.

– వాకల పుష్పావతి, జగనన్న కాలనీ, మెట్ట ఉప్పరగూడెం

గత ప్రభుత్వంలో మా కాలనీ లో ఎనిమిది ట్రాన్స్‌ఫార్మర్లు ఏ ర్పాటుచేశారు. కూటమి ప్రభుత్వంలో రెండింటిని తీసుకెళ్లిపోయారు. మా కాలనీలో రోడ్లు, డ్రెయిన్లు లేక ఇబ్బంది పడుతున్నాం.

– నరసింహరావు, జగనన్న కాలనీ, మార్టేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement