ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఏకగ్రీవం

Oct 8 2026 12:54 AM | Updated on Oct 8 2026 12:54 AM

ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఏకగ్రీవం మావుళ్లమ్మ ఆలయ హుండీల ఆదాయం రూ.33 లక్షలు పురుగు మందు తాగి వ్యక్తి మృతి ఇద్దరికి తీవ్రగాయాలు

భీమవరం : భీమవరంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం గౌరవాధ్యక్షునిగా డీవీవీఎస్‌ వర్మ, అధ్యక్షునిగా చెల్లబోయిన రంగారావు, ప్రధాన కార్యదర్శిగా మందలపర్తి హరీష్‌, కోశాధికారిగా కిలారి మల్లేశ్వరరావు ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా కోనాల భీమారావు, నెక్కంటి సుబ్బారావు, అల్లం నారాయణ, సహాయ కార్యదర్శులుగా దేవ పెద్దిరాజు, తాటికొండ వాసు, పి.ఆదినారాయణ తదితరులతో పాటు మరో 45 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని మహాసభల్లో తీర్మానించారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాల సాధనే లక్ష్యంగా పోరాటాలు నిర్వహించాలని, ప్రతినెలా కనీస వేతనం రూ.36 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని తీర్మానాలు ఆమోదించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): మావుళ్లమ్మవారి దేవస్థానంలో బుధవారం అసిస్టెంట్‌ కమిషనర్‌ బుద్ధ మహాలక్ష్మి నగేష్‌ ఆధ్వర్యంలో హుండీలను తెరిచి కానుకలు లెక్కించారు. గత 40 రోజులకు గాను రూ.33,27,757 నగదుతో పాటు, 35.200 గ్రాముల బంగారం, 144 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ లభించినట్లు అధికారులు తెలిపారు. సింగరాయపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌. గంగా శ్రీదేవి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, ఆలయ చైర్మన్‌ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు పాల్గొన్నారు.

టి.నరసాపురం : పురుగు మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొర్రంపాలెం గ్రామానికి చెందిన కట్టూరి శివరామకృష్ణ (28)కి వివాహమైన అనంతరం పక్షవాతం రావడంతో భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన అతడు, ఒంటరితనం భరించలేక బుధవారం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శివరామకృష్ణ తల్లి వెంకాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ కె.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు.

పెనుమంట్ర: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఓడూరు గ్రామానికి చెందిన జె సువర్ణరత్నం (19), జి అనిల్‌ కుమార్‌ (17) మోటార్‌ సైకిల్‌పై మార్టేరు వైపు వెళుతుండగా వెలగలేరు హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వద్ద మోటార్‌ సైకిల్‌ అదుపుతప్పి పక్కనే ఉన్న కంకర గుట్ట పైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో వారు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమచారం మేరకు వచ్చిన 108 వాహనంలో క్షతగాత్రులకు ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ శ్రీదేవి, పైలెట్‌ జగదీష్‌ ప్రాథమిక చికిత్స అందించి తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మందలపర్తి హరీష్‌, ప్రధాన కార్యదర్శి

చెల్లబోయిన రంగారావు, అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement