రేచర్లలో రైతుల రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

రేచర్లలో రైతుల రాస్తారోకో

Oct 8 2026 12:54 AM | Updated on Oct 8 2026 12:54 AM

రిలయన్స్‌ యూసీజీ ప్రాజెక్టు విరమించుకోవాలని డిమాండ్‌

రిలయన్స్‌ యూసీజీ ప్రాజెక్టు విరమించుకోవాలని డిమాండ్‌

చింతలపూడి: రిలయన్స్‌ గో బ్యాక్‌ అంటూ భూగర్భ బొగ్గు ఆధారిత గ్యాస్‌ ఉత్పత్తి (యూసీజీ) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో రేచర్లలోని గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే అండర్‌ పాస్‌ వద్ద రైతులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు రేచర్ల వద్ద ఉన్న బొగ్గు బోర్‌ వద్ద నిరసన వ్యక్తం చేసిన రైతులు, అక్కడ నుంచి గ్రీన్‌ ఫీల్డ్‌ వరకు ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ రిలయన్స్‌ యూసీజీ ప్రాజెక్టు కోసం రైతుల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం, అధికారులు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. రిలయన్స్‌ కంపెనీకి ప్రజా సంపదను కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, ప్రజల జీవితాలను నాశనం చేయడం అన్యాయమన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఆయిల్‌ పామ్‌, కోకో, కొబ్బరి, అరటి, మొక్కజొన్న, వరి తదితర పంటలు దెబ్బతిని, రైతులు, వ్యవసాయ ఆధారిత ప్రజలు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే యూసీజీ ప్రాజెక్టు ప్రతిపాదనను విరమించుకోవాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆర్వీఎస్‌. నారాయణ, రైతు సంఘం నాయకులు పి.పాండురంగారావు, రైతులు కంచర్ల శ్రీనివాసరావు, కొనకళ్ళ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement