రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పట్టివేత

Oct 7 2026 2:04 AM | Updated on Oct 7 2026 2:04 AM

రేషన్‌ బియ్యం పట్టివేత

దెందులూరు: కూచిపూడిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ ఎస్సై నాగరాజు, సివిల్‌ సప్లై డిప్యూటీ తహశీల్దార్‌ పట్టుకున్నట్లు పోతునూరు వీఆర్‌ఓ రామచంద్రరావు తెలిపారు. కూచిపూడి గ్రామానికి చెందిన దుర్గారావు వ్యాన్‌లో డ్రైవర్‌ నవీన్‌బాబు అక్రమంగా పీడీఎస్‌ బియ్యాన్ని తాడేపల్లిగూడెం తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు, దెందులూరు గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై ఆవాహనాన్ని పట్టుకున్నారు. ఈ దాడిలో రూ.2 లక్షల విలువైన 50 కేజీల బస్తాలు 100 అక్రమ పీడీఎస్‌ బియ్యంతో పాటు, రూ.8 లక్షల విలువైన వ్యాన్‌ను సీజ్‌ చేసినట్లు తెలిపారు. అక్రమ పీడీఎస్‌ బియ్యం రవాణాపై విజిలెన్స్‌ పోలీసులు ఒక కేసు, దెందులూరు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై మరొక కేసు నమోదు చేశారని వీఆర్‌ఓ రామచంద్రరావు వివరించారు. తహసీల్దార్‌ బి. సుమతి ఆదేశాల మేరకు సీజ్‌ చేసిన పీడీఎస్‌ బియ్యాన్ని కొవ్వలి షాప్‌ నంబర్‌–14కు తరలించి భద్రపరిచినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement