పారిజాతగిరిలో రెండో రోజు పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

పారిజాతగిరిలో రెండో రోజు పవిత్రోత్సవాలు

Oct 7 2026 2:04 AM | Updated on Oct 7 2026 2:04 AM

పారిజాతగిరిలో రెండో రోజు పవిత్రోత్సవాలు

జంగారెడ్డిగూడెం(చింతలపూడి): గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు మంగళవారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. ఉదయం విశ్వక్సేన పూజతో ప్రారంభమైన వైదిక కార్యక్రమాలు శ్రీ వైఖానస ఆగమయుక్తంగా, శాస్త్రోక్తంగా సాగాయి. పానంగిపల్లి సత్యపవన్‌ కుమార్‌ ఆచార్యుల బ్రహ్మత్వంలో, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్‌ ఆచార్యుల ఆధ్వర్యంలో పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, పంచగవ్యప్రాశన, పంచగవ్య ప్రోక్షణ, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు పర్యాగ్నీకరణ, పవిత్ర అభిమంత్రణ, అగ్నిప్రతిష్ఠలతో పాటు యాగశాలలో విశేష హోమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్త వీర రాఘవరావు శర్మ, అభివృద్ధి కమిటీ ప్రతినిధి పేరిచర్ల జగపతిరాజులతో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పవిత్రోత్సవాల ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) మానికల రాంబాబు దగ్గరుండి పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement