రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు తోకలపల్లి విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు తోకలపల్లి విద్యార్థులు

Oct 7 2026 2:04 AM | Updated on Oct 7 2026 2:04 AM

గణపవరం(నిడమర్రు): నిడమర్రు మండలం తోకలపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు అరిగల గోపాలకృష్ణ తెలిపారు. జిల్లా స్థాయిలో అండర్‌–19 విభాగంలో నిర్వహించిన కబడ్డీ, రగ్బీ, బేస్‌బాల్‌ పోటీలలో విజేతలుగా నిలిచిన ఆరుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. కబడ్డీలో సింధుజ, హెప్సిబా, రగ్బీలో ప్రకాష్‌, గణసల లక్ష్మి సంధ్యారాణి, సైదు సత్యస్వరూప్‌, బేస్‌బాల్‌లో సైదు రమ్యశ్రీ ఆయా క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి కర్నూలులో రాష్ట్రస్థాయి పోటీలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులను హెచ్‌ఎం గోపాలకృష్ణ, ఎస్‌ఎంసీ ఛైర్మన్‌ సైదు ఏడుకొండల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement