పరిహారం.. పరిహాసం | - | Sakshi
Sakshi News home page

పరిహారం.. పరిహాసం

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

పెచ్చుమీరుతున్న మోసాలు

న్యూస్‌రీల్‌

కర్షకులపై కూటమి కక్ష

పెచ్చుమీరుతున్న మోసాలు
జిల్లాలో ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. పీజీఆర్‌ఎస్‌లో చీటింగ్‌ కేసులకు సంబంధించి బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. 8లో u
సాగులో విపత్తులు కర్షకులను కుదేలు చేస్తున్నాయి. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. పరిహారం విడుదలకు తీవ్ర జాప్యం చేస్తోంది. ఇటీవల అర్ణబ్‌ తుఫానుతో జిల్లాలోని దాదాపు ఐదు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. గత ఖరీఫ్‌లో మొంథాతో రూ. 23 కోట్లు పంట నష్టం వాటిల్లి ఏడాదవుతున్నా ఇంకా పరిహారం అందించలేదు.

బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి, భీమవరం : జిల్లాలోని 2.08 లక్షల ఎకరాల్లో రైతులు ఖరీఫ్‌ సాగు చేస్తున్నారు. ముందుగా సాగు చేపట్టిన తాడేపల్లిగూడెం రూరల్‌ ప్రాంతంలో వరి పంట గింజ గట్టిపడుతుండగా, సాగు ఆలస్యమైన మిగిలిన ప్రాంతాల్లో పాలుపోసుకునే దశల్లో ఉంది. బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా వారం రోజుల క్రితం కురిసిన కుంభవృష్టితో జిల్లా లోని వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది. తాడేపల్లిగూడెం రూరల్‌, అత్తిలి, యలమంచిలి, పాలకొల్లు, వీరవాసరం, ఆచంట తదితర 14 మండలాల్లోని 77 గ్రామాల పరిధిలో 2099 మంది రైతులకు చెందిన పంట నీట మునిగినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అధికంగా తాడేపల్లిగూడెం రూరల్‌లో 1563 ఎకరాలు, అత్తిలిలో 701 ఎకరాల్లో పంట దెబ్బతింది. ముంపునుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర అగచాట్లు పడాల్సి వచ్చింది. రోజులు తరబడి పంట నీటమునిగిన పొలాల్లో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఏడాదైనా అందని పరిహారం

గత ఖరీఫ్‌ చివరి దశలో వచ్చిన మోంథా తుఫాను పంటకు తీవ్ర నష్టం కలిగించింది. రోజుల తరబడి పొలాల్లోని ముంపునీరు బయటకు లాగక పొట్టలు కుళ్లిపోయి ఎంటీయూ 1318, పీఎల్‌ఏ 1100, తదితర రకాల్లో తాలు గింజల శాతం పెరిగిపోయింది. 4,207 హెక్టార్లలోని పంట నీట మునగ్గా, 6,560 హెక్టార్లలోని పంట నేల వాలినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

క్షేత్రస్థాయిలో పరిశీలనలో జిల్లాలోని 9,201 (సుమారు 23002 ఎకరాలు) హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్టు లెక్కతేల్చారు. ప్రాథమిక అంచనా కంటే తుది నష్టం భారీగా తగ్గించేశారన్న విమర్శలున్నాయి. అత్యధికంగా నరసాపురంలో 2,722 మంది రైతులకు చెందిన 1,281 హెక్టార్లు, పెంటపాడులో 2,230 మంది రైతులకు చెందిన 1,078 హెక్టార్లలో నష్టం జరిగింది. తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, వీరవాసరం మండలాల్లో 500 హెక్టార్లకు పైబడి, ఆకివీడులో 464 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. హెక్టారుకు రూ. 25 వేలు చొప్పున రూ. 23 కోట్లు సాయాన్ని ప్రభుత్వం రైతులకు అందించాల్సి ఉంది. నష్టం జరిగి ఏడాదికావస్తున్నా చంద్రబాబు సర్కారు ఇంకా పరిహారం అందించకపోవడం గమనార్హం.

తెరపైకి నీటి తీరువా

మరోవైపు గత ప్రభుత్వం పక్కన పెట్టేసిన నీటితీరువాను తెరపైకి తెచ్చింది. పాత బకాయిలు పేరిట రైతుల నుంచి రూ. 21.81 కోట్లు వసూలు చేసే పనిలో ఉంది. పెట్టుబడులకు సొమ్ముల్లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వేలకు వేలు నీటి తీరువా చెల్లించాల్సి రావడం భారమవుతోంది. ఎరువులు కొరత, సాగునీటి ఎద్దడి, కొనుగోళ్లలో దళారుల దోపిడీతో పంటకు గిట్టుబాటు ధర అందకపోవడం తదితర రూపాల్లో గత రెండేళ్లుగా రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు.

రైతుపై ప్రీమియం భారం పడకుండా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకానికి చంద్రబాబు సర్కారు తొలి ఏడాది నుంచే ఎగనామం పెట్టింది. దీంతో రైతులే ప్రీమియం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఉదాహరణకు ఎకరాకు పంట విలువ రూ. 41,000లో ప్రీమియంగా రెండు శాతం మొత్తం రూ. 820లు బీమా కంపెనీకి చెల్లించాలి. దీనిలో ప్రభుత్వ వాటా 0.5 శాతం (రూ. 205ల) కాగా, 1.5 శాతం (రూ. 615లు) రైతులే చెల్లించాలి. ఏడాదికి ప్రీమియం రూపంలో వరి రైతులపై సుమారు రూ.28 కోట్లు భారం పడుతున్నట్టు అంచనా.

విపత్తులతో కర్షకులు కుదేలు

వేల ఎకరాల్లో పంటను ముంచిన అర్ణ్ణబ్‌

మొంథాతో రూ. 23 కోట్లు పంట నష్టం

ఏడాదైనా ఇంకా అందని పరిహారం

వైఎస్సార్‌ సీపీ హయాంలో ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో నష్టపరిహారం జమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement