వృద్ధుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టాలు | - | Sakshi
Sakshi News home page

వృద్ధుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టాలు

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

వృద్ధుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఆర్థిక వ్యవస్థకు కార్మికుల శ్రమే మూలధనం కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి జపాన్‌ ‘సి2సి4సి’సైకిల్‌ యాత్రకు ఎంపిక

భీమవరం: వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు వృద్ధాశ్రమాలు, వయోవృద్ధుల కేంద్రాలు, సామాజిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని జాయింట్‌ కలెక్టర్‌ కె.ఆర్‌. కల్పశ్రీ తెలిపారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మంగళవారం భీమవరంలోని శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేస్తే వారి రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటి ద్వారా హక్కులు కాపాడుకోవచ్చని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారిని జేసీ సత్కరించారు. సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం ప్రతినిధులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఫోరం గౌరవాధ్యక్షుడు వెంపరాల నారాయణమూర్తి, అధ్యక్షుడు నల్లం వెంకటకృష్ణనాగేశ్వరరావు, జిల్లా వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ప్రభాకరరావు, సూపరింటెండెంట్‌ కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: దేశ ఆర్థిక వ్యవస్థకు కార్మికుల శ్రమయే మూలధనమైనప్పటికీ, వారి జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో మెరుగుపడటం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌. రవీంద్రనాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరంలో మంగళవారం నిర్వహించిన ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభల్లో ఆయన ప్రసంగించారు. శ్రమకు తగిన ప్రతిఫలం, ఉద్యోగ భద్రత, పని ప్రదేశాల్లో రక్షణ వంటి ప్రాథమిక హక్కుల కోసం కార్మికులు నేటికీ పోరాడాల్సి రావడం విచారకరమన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్‌ మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థల ఏర్పాటు, లక్షలాది మందికి ఉపాధి లభించడంలో ఏఐటీయూసీ పోరాటాల పాత్ర కీలకమని గుర్తుచేశారు. నెక్కంటి సుబ్బారావు, కోనాల భీమారావు, మందుల లక్ష్మి, తాటికొండ వాసు, ఎస్‌. వెంకటసుబ్బయ్య, అల్లం సత్యనారాయణ పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్‌ చేయాలని ఏపీ జేఏసీ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మంగళవారం భీమవరంలోని కలెక్టరేట్‌ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ కార్మికులకు 100 శాతం గ్రాస్‌ వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

వీరవాసరం: క్యాన్సర్‌ అవగాహన, పరిశోధనల నిధుల సేకరణే ధ్యేయంగా జపాన్‌లో జరిగే ‘సి2సి4సి ఆసియా పసిఫిక్‌’ అంతర్జాతీయ సైకిల్‌ యాత్రకు వీరవాసరం మండలం నడపనవారిపాలేనికి చెందిన కొత్తపల్లి త్రిలోక్‌ ఎంపికయ్యారు. అక్టోబర్‌ 6 నుంచి 20 వరకు జరిగే ఈ యాత్రలో 6 దేశాల ప్రతినిధులు 1,800 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. త్రిలోక్‌ అక్టోబర్‌ 12 నుంచి 14 వరకు సైకిల్‌ యాత్ర చేపడతారు. ఈ యాత్ర ద్వారా భారత రైడర్ల బృందం సేకరించిన రూ. 12 లక్షల నిధులను ముంబై టాటా మెమోరియల్‌ ఆస్పత్రికి అందించనున్నారు. త్రిలోక్‌ను గ్రామస్తులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement