ఉద్యానవర్సిటీకి నూతన పేటెంట్లు | - | Sakshi
Sakshi News home page

ఉద్యానవర్సిటీకి నూతన పేటెంట్లు

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

ఉద్యానవర్సిటీకి నూతన పేటెంట్లు

తాడేపల్లిగూడెం: వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం కళాశాల చివరి సంవత్సర విద్యార్థులు తేనెపట్టు మైనం (బీ వ్యాక్స్‌) ఆధారిత వినూత్న ఉత్పత్తులను రూపకల్పన చేసి, మొత్తం ఆరు పేటెంట్లతో నూతన మైలురాయిని అధిగమించారని వర్సిటీ ఉపకులపతి (వీసీ) డాక్టర్‌ కె.ధనుంజయరావు అభినందించారు. మంగళవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన బీ వ్యాక్స్‌ షూ పాలిష్‌, ఫర్నీచర్‌ పాలిష్‌, హెయిర్‌ కండిషనర్‌ ఉత్పత్తులకు సంబంధించిన మూడు కొత్త పేటెంట్లు అధికారికంగా ప్రచురితం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను, శాసీ్త్రయ నైపుణ్యాలను మేళవించి నూతన వ్యాపార ఆలోచనలను వెలికితీయడంలో కోర్సు ఇన్‌చార్జి ఇమ్మాన్యుయేల్‌ పర్యవేక్షణ, ప్రయోగాత్మక అభ్యసన ప్రక్రియ ఎంతగానో తోడ్పడ్డాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, డీన్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement