భీమవరం: ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి పతకాలు సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని ఏషియన్ గేమ్స్ ఆర్చరీ విజేతలు బొమ్మదేవర ధీరజ్, తిరుమూరి గణేష్ మణిరత్నం తెలిపారు. భీమవరం ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు మంగళవారం విచ్చేసిన సందర్భంగా వారు మాట్లాడారు. తమ సంస్థ క్రీడాకారులు దేశానికి పతకాలు తీసుకురావడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఒలింపిక్స్ పతకాలతో దేశ కీర్తిని పెంచాలని ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర ఛైర్మన్ చెరుకూరి సత్యనారాయణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జయరాజు తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: ఇటీవల తణుకులో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–16 కబడ్డీ పోటీల్లో కడియద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం పి. సుబ్బలక్ష్మి తెలిపారు. ఎంపికై న వారిలో ఎం. మణికంఠ, జి.సాయితేజ, కె. సాయి చంద్రశేఖర్, బి.నాగదుర్గ, బి.మానస వెంకట సాయి మాధవి ఉన్నారన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను, పీడీ కె.సుభద్రను హెచ్‌ఎం అభినందించారు.


