మావుళ్లమ్మ సేవలో ‘తెల్ల కాగితం’ చిత్ర యూనిట్‌ | - | Sakshi
Sakshi News home page

మావుళ్లమ్మ సేవలో ‘తెల్ల కాగితం’ చిత్ర యూనిట్‌

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

మావుళ్లమ్మ సేవలో ‘తెల్ల కాగితం’ చిత్ర యూనిట్‌

భీమవరం (ప్రకాశంచౌక్‌): కుటుంబ సమేతంగా చూడదగ్గ సందేశాత్మక చిత్రం తెల్ల కాగితం మంచి విజయం సాధించడం అభినందనీయమని శ్రీమావుళ్లమ్మ దేవస్థానం ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్‌, చైర్మన్‌ బోండాడ నాగభూషణం అన్నారు. మంగళవారం ఈ చిత్ర హీరో రోషన్‌, హీరోయిన్‌ నక్షత్ర, దర్శకుడు రమేష్‌లతో కూడిన చిత్ర బృందం అమ్మవారిని దర్శించుకుంది. అనంతరం ఆలయ కళా వేదికపై అరసవల్లి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చిత్ర యూనిట్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, భీమవరానికి చెందిన రమేష్‌ దర్శకత్వం వహించి విజయం సాధించడం స్థానికులకు గర్వకారణమన్నారు. అనంతరం భీమవరంలోని పద్మాలయ థియేటర్‌ను సందర్శించి, ప్రేక్షకులతో కలిసి విజయోత్సవ ఆనందాన్ని పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement