భీమవరం: బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని, అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. సోమవారం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో పలువురి నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంపై స్టేషన్ అధికా రులతో మాట్లాడారు. మొత్తంగా 9 అర్జీలు స్వీకరించారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వే ధింపులు, ఆస్తి తగాదాలు, సైబర్ మోసాలు, అధిక వడ్డీలు, ప్రేమ పేరుతో మోసాలపై బాధి తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. చట్టపరంగా న్యాయం చేస్తామని బాధితులకు ఎస్పీ భరోసా కల్పించారు. జిల్లా అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు.
భీమవరం: దేశ ప్రగతికి ఉపయోగపడే డ్రోన్ టెక్నాలజీ రూపకర్తలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అని ఎన్‌ఐటీ రూర్కెలా మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ పీఎస్ బాలాజీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం జరిగిన డిజైన్ అండ్ ఏరో మెకానిక్స్ ఆఫ్ మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ ఫర్ సర్వేలెన్స్ విత్ సెన్సార్ ఫ్యూజన్ బూట్ క్యాంప్‌లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ ఏడాదిలో 34 వర్క్‌షాప్‌లు నిర్వహించామన్నారు. మరో ప్రాజెక్ట్ ఇంజనీర్ చికేశ్ రంజన్ మాట్లాడుతూ ఐదు రోజుల క్యాంపులో డ్రోన్ స్పేర్ పార్ట్స్ బిగించి ఫ్లై చేసేలా శిక్షణ ఇస్తామన్నారు. కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ డ్రోన్ టెక్నా లజీ వినియోగం వ్యవసాయంలో బాగా పెరి గిందని, భవిష్యత్‌లో మరింత పెరుగుతుందన్నారు. కో–ఆర్డినేటర్ ఆర్.వేణురెడ్డి, బూట్ క్యాంప్ కో–ఆర్డినేటర్ వి.మణికాంత్, ఇంద్రారెడ్డి, ఎంవీవీ కృష్ణ పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): తిరుమలలో ని త్యాన్నదానానికి కంతేటి జానకి జ్ఞాపకార్థం ఆ మె భర్త మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాాజు సోమవారం టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర కార్యాలయంలో రూ.1,01,01,006 అందజేశారు. భీమవరం హౌసింగ్ బోర్డ్ వేంకటేశ్వస్వామి వారి ఆలయ అధ్యక్షుడు కంతేటి వెంకటరాజు, కృష్ణప్రియ సుబ్బరాజు పాల్గొన్నారు.
వీరవాసరం: పశ్చిమగోదావరి జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14 బాలబాలికల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ జట్లను ఎంపిక చేయనున్నారు. తణుకు ఎస్‌కేఎస్‌డీ కళాశాలలో పోటీలు నిర్వహించనున్నట్టు ఫెడరేషన్ కార్యదర్శులు జి.నర్మద, మహమ్మద్ కుద్దూస్ ప్రకటనలో తెలిపా రు. క్రీడాకారులు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ 9885158366లో సంప్రదించవచ్చు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు విజయవాడ గొల్లపూడిలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఏలూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడీ వై.విశ్వమోహన్‌రెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన బీసీ, ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులు అర్హులని ఈనెల 20లోపు ఏ లూరులోని బీసీ సంక్షేమ సాధికార కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


