వృద్ధులే లక్ష్యంగా ఫేస్‌బుక్ వేదికగా ఎరవేసి, అదును చూసి హనీట్రాప్ చేసి దండుకుంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8లో u
మా తాతముత్తాతల కాలం నుంచి ఈ భూముల మీదే బతుకుతున్నాం. మా ఊళ్ల ను శ్మశానాలుగా మార్చే ఈ ప్రాజెక్టు మాకొద్దు. ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఏం జరుగుతుందో ఒక్కరూ చెప్పట్లేదు. అడిగితే దాటవేస్తున్నారు. ప్రాణాలు పోయినా మా భూములను ఇచ్చేది లేదు. కోర్టులకై నా వెళ్లి మా నేలను కాపాడుకుంటాం.
– యర్రంశెట్టి రామకృష్ణారావు,
రైతు, సుబ్బారాయుడుగూడెం
కంపెనీ వాళ్లు 8,500 ఎకరాలు మాత్రమే తీసుకుంటామని చెబుతున్నారు. అయితే భూ గర్భంలో మంటలు పెట్టి గ్యాస్ తీస్తే ఆ పక్కనున్న వే లాది ఎకరాల భూములు, భూగర్భ జలాలు నాశనం కావా? చుట్టుపక్కల ఊళ్లన్నీ రోగాల బారిన పడవా? గ్రామసభ పెట్టి అభిప్రాయం తీసుకోకుండా ఎలా ముందుకు వెళతారు.
– ఆది హరికృష్ణ, రైతు, శెట్టివారిగూడెం


