ఫార్మా కంపెనీపై విజిలెన్స్‌ దాడి | - | Sakshi
Sakshi News home page

ఫార్మా కంపెనీపై విజిలెన్స్‌ దాడి

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

తాడేపల్లిగూడెం: పట్టణంలోని సీజీఆర్‌ ఫార్మా కంపెనీపై సోమవారం డ్రగ్‌ కంట్రోల్‌, విజిలెన్స్‌ అధి కారులు దాడి చేశారు. కంపెనీ గోదాముల్లో సో దాలు చేశారు. డ్రగ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ జనరల్‌ పి.అరుణ్‌బాబు మాట్లాడుతూ పట్టణానికి చెందిన చలంచర్ల మురళీ కుటుంబానికి చెందిన సీజీఆర్‌ ఫార్మా కంపెనీపై ఫిర్యాదులు వస్తున్న క్రమంలో దాడులు చేశామన్నారు. మందుల అమ్మకాలు, రికార్డులు, నగదు లావాదేవీలు, గోదాముల్లో నిల్వలు తదితర అంశాలను తనిఖీ చేశామని, అనధికారికంగా మందుల విక్రయాలు జరిగినట్టు గుర్తించామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రూ.కోటికి పైగా జీఎస్‌టీ ఎగవేత జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. కంపెనీ రికార్డులు, హార్డ్‌ డిస్కులను స్వాధీ నం చేసుకున్నట్టు సమాచారం. రూ.100 మందును రూ.20కు విక్రయించినట్టు బిల్లులు ఉన్నాయని, ఇదే విషయాన్ని సంస్థ ప్రతిఽనిధి కూడా అంగీకరించారన్నారు. ఏ ఆస్పత్రులకు మందులు సరఫరా చేస్తున్నారు, వైద్యులకు ఏమేరకు నజరానాలు ఇస్తున్నామనే విషయాలు కూడా చెప్పారన్నారు. ఈ యజమాని కుటుంబం పేరిట మూడు కంపెనీలు ఉన్నాయని, మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని అరుణ్‌బాబు తెలిపారు. మరో రెండు రోజుల పాటు సోదాలు కొనసాగుతాయన్నారు. అక్రమాలు జరిగినట్టు నిర్ధారణయితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement