అర్జీల పరిష్కారం వేగిరపర్చాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారం వేగిరపర్చాలి

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

భీమవరం(ప్రకాశం చౌక్‌): పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదుల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని పక్షంలో అర్జీదారుడికి తెలియజేయాలన్నారు. జేసీ కేఆర్‌ కల్పశ్రీ, డీఆర్వో పి.గ్లోరియా, కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్‌ పి.ప్రభాకరరావు, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్‌ అప్పారావు పాల్గొన్నారు.

అక్రమ లేవుట్లలో ఇక్కట్లు

నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయించారని, 18 అడు గుల రోడ్డు చూపించారని, అయితే రోడ్డుకు సంబంధించి స్థలం యజమాని తమకు దారి లేకుండా చేశారని బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వినతి : జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖలోని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సమస్యల పరిష్కరం కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఉదోగ్య భద్రత కల్పించాలని, గ్రాస్‌ జీతం పునరుద్ధరించాలని, 2018 నుంచి అమలులోకి వచ్చిన వేతన తగ్గింపును సమీక్షించాలని కోరారు. జిల్లా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

గళమెత్తిన ‘ఉపాధి’ ఉద్యోగులు

వీబీజీ రామ్‌జీ (ఉపాధి హామీ) పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరం కావడం లేదన్నారు. పీఆర్‌సీ, ఉద్యోగ భద్రత, హెల్త్‌కార్డులు, పదోన్నతి, కారుణ్య నియామకం, సమాన పనికి సమాన వేతనం తదితర సమస్యలు పరిష్కరించాలన్నారు. డిప్యూటీ సీ ఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకేష్‌ సమస్యల పరి ష్కారానికి హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.

కలెక్టర్‌ నాగరాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement