ఆలోచనలను అంకుర సంస్థలుగా మార్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆలోచనలను అంకుర సంస్థలుగా మార్చుకోవాలి

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

తాడేపల్లిగూడెం: సృజనాత్మక ఆలోచనలను విద్యార్థులు అంకుర సంస్థలుగా మలచుకోవాలని ఏపీ నిట్‌ డిజిగ్నేటెడ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె. వెంకటకృష్ణారావు కోరారు. ఏపీ నిట్‌లోని సంస్థాగత ఆవిష్కరణ మండలి (ఐఐసీ), రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (రాజమహేంద్రవరం – ఆర్‌టీఐహెచ్‌) సంయుక్త ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించనున్న స్పార్క్‌ ఫ్యూచర్‌ ఫౌండర్స్‌ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం బృందావన్‌ భవన్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిట్‌ రిజిస్ట్రార్‌ దినేష్‌ శంకరరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, వారి ఆలోచనలకు ప్రోత్సాహం అందించేలా విద్యాసంస్థల్లో ఆవిష్కరణల వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. డీన్‌ రీసెర్చ్‌ అండ్‌ కన్సల్టెన్సీ ప్రొఫెసర్‌ జి. రవికిరణ్‌ శాస్త్రి మాట్లాడుతూ.. పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమల మధ్య సమన్వయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఐఐసీ అధ్యక్షుడు డాక్టర్‌ వి. సందీప్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంస్కృతిని పెంపొందించేందుకు ఐఐసీ నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఆర్‌టీఐహెచ్‌ రాజమండ్రి ఇన్నోవేషన్‌ హెడ్‌ డాక్టర్‌ చంద్రప్రకాశ్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రారంభ దశ ఆలోచనలను గుర్తించి, వాటిని మెరుగుపరిచి మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐసీ సమన్వయకర్త టి. కార్తికేయశర్మ, డీన్‌ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ హిమబిందు, ఆచార్యులు శ్రీఫణికృష్ణ, టి. కిరణ్‌, తపస్‌, సుదర్శన్‌ దువా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement