టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

కై కలూరు: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకంతో కూటమి కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని వైఎస్సార్‌ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌) అన్నారు. ముదినేపల్లి మండలం వైవాక గ్రామానికి చెందిన టీడీపీ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు జాజుల సుబ్రహ్మణ్యం, నాయకులు నగుళ్ల రామాంజనేయులు, నాగరాజు(అయ్యప్ప) కై కలూరు వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో పార్టీలో చేరారు. డీఎన్నార్‌ వారికి పార్టీ కండవాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ముదినేపల్లి మండలం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బోయిన రామరాజు, నాయకులు పాల్గొన్నారు.

ముదినేపల్లి రూరల్‌: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం – చేవూరుపాలెం సెంటర్‌లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయానికే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారి పుట్టలో పాలుపోసి దర్శించుకున్నారు. మహిళలు పాలపొంగళ్లశాల వద్ద నైవేద్యాలు సమర్పించారు. నాగబంధాలు, గోకులంలో భక్తులు పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. సహాయ కమిషనర్‌ ఆర్‌.గంగాఽశ్రీదేవి, చైర్మన్‌ బొంగు రవికుమార్‌, పాలకవర్గ సభ్యులు పర్యవేక్షణ చేశారు.

యలమంచిలి: బూరుగుపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి బంగారు, వెండి వస్తువులతో పాటు ద్విచక్ర వాహనాన్ని అపహరించిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మోటూరి రాజ్‌కుమార్‌ తెలిపారు. వివరాల ప్రకారం బోనం జగదీష్‌ తల్లి రుక్మిణీదేవి గతేడాది సెప్టెంబర్‌ 22వ తేదీన హైదరాబాద్‌ వెళ్లారు. అప్పటి నుంచి ఆమె అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో అదే ఇంటి పైభాగంలో అద్దెకు ఉంటున్న చేగొండి శేషావతారం ఈ నెల 3వ తేదీ ఉదయం కిందకు వచ్చి చూడగా, ఇంటి తాళం బద్దలు కొట్టి ఉండడాన్ని గమనించి వెంటనే జగదీష్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. దీంతో జగదీష్‌ వచ్చి పరిశీలించగా, ఇంట్లో ఉన్న కాసున్నర బంగారం, రెండు కిలోల వెండితో పాటు పార్క్‌ చేసి ఉన్న యూనికాన్‌ బైక్‌ చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపారు.

అత్తిలి: అదనపు కట్నం తీసుకురమ్మని వేధిస్తున్న భర్త, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కేఎన్‌ విశ్వనాథ్‌ చెప్పారు. వివరాల ప్రకారం అత్తిలి మట్టపర్తిగర్వుకు చెందిన బంగారు లక్ష్మీగాయత్రితో అత్తిలి మండలం వరిఘేడు గ్రామానికి చెందిన సోమరాజుకు 2015లో వివాహమైంది. వివాహ సమయంలో కట్నకానుకుల కింద రూ.5 లక్షలు నగదు, 5 కాసుల బంగారు ఆభరణాలు ఇచ్చారన్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఇటీవల మరో రూ.5 లక్షలు అదనపు కట్నం తీసుకురమ్మని భర్త సోమరాజు, మరో నలుగురు కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని బాధితురాలు లక్ష్మీగాయత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తణుకు అర్బన్‌: హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సీహెచ్‌వీ సత్యనారాయణ తెలిపారు. తణుకు రాష్ట్రపతి రోడ్డులోని శ్రీదేవి హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న కర్రి శ్రీనివాసరెడ్డి, గత నెల 30వ తేదీన హోటల్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో పాటు బంధువుల ఇళ్లకు కూడా వెళ్లలేదని కుటుంబ సభ్యులు నిర్ధారించుకున్నారు. గతంలో కూడా ఇలాగే ఇంటి నుంచి వెళ్లిన సందర్భాలు ఉండడంతో, నాలుగు రోజులు వేచి చూసి ఆ తర్వాత ఈనెల 3వ తేదీన తణుకు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదు రోజులు గడుస్తున్నా శ్రీనివాసరెడ్డి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ అదృశ్యం వెనుక ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? లేదా ఇతర వేధింపులు కారణమా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement