మద్ది అంజన్నకు పంచామృతాభిషేకం | - | Sakshi
Sakshi News home page

మద్ది అంజన్నకు పంచామృతాభిషేకం

Oct 4 2026 10:55 AM | Updated on Oct 4 2026 10:55 AM

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

జంగారెడ్డిగూడెం(చింతలపూడి): గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం ఆలయ ముఖమండపంలో స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ.1,88,950 ఆదాయం సమకూరిందని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌వీ చందన తెలిపారు. అలాగే నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1,693 మంది భక్తులకు అన్నదానం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.

ముసునూరు: ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముసునూరులో చోటు చేసుకుంది. ఎస్సై ఎం.చిరంజీవి తెలిపిన వివరాలివి. ముసునూరు గ్రామానికి చెందిన కంచర్ల గంగాధరరావు(52) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన గంగాధర రావు కుటుంబ సభ్యులతో ఘర్షణ పడ్డాడు. అనంతరం మేడపైన గదిలోకి వెళ్లాడు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు గమనించే సరికి చీరతో ఇంటిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. సిబ్బంది పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement