పోలవరం పనుల నాణ్యతపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

పోలవరం పనుల నాణ్యతపై సమీక్ష

Oct 4 2026 10:55 AM | Updated on Oct 4 2026 10:55 AM

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు పనులను పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) సంజీవ్‌ వోహ్రా శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్ట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం, పనుల పురోగతిని నేరుగా పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కీలకమైన ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణంలో ఎలాంటి ఏమరపాటుకూ ఆస్కారం ఇవ్వవద్దని ఆదేశించారు. నిర్మాణ ప్రాంతాలైన గ్యాప్‌–1, గ్యాప్‌–2 లలో దశలవారీగా రాయి, మట్టి, ఇసుకతో నింపుతున్నందున, నిత్యం రోడ్‌ రోలర్లతో గట్టిపరుస్తూ పటిష్టతను తనిఖీ చేయాలన్నారు. గ్యాప్‌ 1, 2, జి–హిల్‌ ప్రాంతాలను ఆయన కాలినడకన సందర్శించి పనుల నాణ్యతను పరిశీలించారు.

కేంద్రం నుంచి పూర్తి సహకారం

ప్రాజెక్టును నిర్దేశిత సమయానికి పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని సీఈఓ స్పష్టం చేశారు. నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ నెలలో విదేశీ నిపుణుల బృందం పర్యటించనున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీపీఏ ఉపసంచాలకుడు రవి, జలవనరుల శాఖ ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి, ఎస్‌ఈ పి.రామచంద్రరావు, క్వాలిటీ సీఈ శేషుబాబు, ఈఈ డి. శ్రీనివాస్‌, ఎంఈఐఎల్‌ జీఎం ఎ.గంగాధర్‌, డీజీఎంలు మురళి పమ్మి, జి.శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement