సహస్ర గళం.. పారాయణ వైభవం | - | Sakshi
Sakshi News home page

సహస్ర గళం.. పారాయణ వైభవం

Oct 2 2026 7:32 AM | Updated on Oct 2 2026 7:32 AM

ప్రవచనం చెపుతున్న మణిప్రసన్నమ్మ, సహస్రగళ లలితా పారాయణంలో పాల్గొన్న మహిళలు

పాలకొల్లు సెంట్రల్‌: మహిళా సాధికారత, యువజన సాధికారత, సంతోషకరమైన కుటుంబాల నిర్మాణం, ఆనందదాయకమైన వృద్ధాప్యం ప్రతి ఒక్కరూ పాటిస్తే ప్రేమతో కూడిన ప్రపంచం ఏర్పడుతుందని కామాఖ్యామృత పీఠం హైదరాబాద్‌ శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ (మణిప్రసన్నమ్మ) అన్నారు. గురువారం పట్టణంలోని బ్రాడీపేట బైపాస్‌ రోడ్డులో ఉన్న ఎస్‌. కన్వెన్షన్‌ హాలులో సనాతన భక్తిమండలి, శ్రీ విద్యా ఉపాసకురాలు డాక్టర్‌ నంబూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో సహస్రగళ లలితా పారాయణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సుమారు 2,500 మంది మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా లలితా సహస్రనామ పారాయణ విశిష్టతను వేణుశ్యామ వివరించారు. భక్తులకు ఉచ్చరణ దోషాలు లేకుండా సరైన పద విభజనతో మూడు పర్యాయాలు పారాయణం చేయించారు. ఎస్‌. కన్వెన్షన్‌ హాలు భక్తులతో కిటకిటలాడింది. పట్టణంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ అన్నసమారాధన నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement